Love Mouli : నవదీప్ ‘లవ్ మౌళి’ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు.. ఆ సీన్స్ వల్లే.. ?

ఇటీవల నవదీప్ లవ్ మౌళి సినిమా వాయిదా పడినట్టు తెలిపాడు.

Love Mouli : నవదీప్ ‘లవ్ మౌళి’ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు.. ఆ సీన్స్ వల్లే.. ?

Navdeep Love Mouli Movie Postponed Due to Censor Rumours goes Viral

Love Mouli : నవదీప్(Navdeep) కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా ‘లవ్ మౌళి’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నేడు ఏప్రిల్ 19న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ సినిమా వాయిదా పడింది. ఇటీవల నవదీప్ ఈ సినిమా వాయిదా పడినట్టు కూడా తెలిపాడు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, థియేటర్స్ ఇష్యూ వల్లో లవ్ మౌళి వాయిదా పడింది అనుకున్నారు. కానీ లవ్ మౌళి సినిమాకు ఇంకా సెన్సార్ అవ్వలేదని తెలుస్తుంది.

ఇటీవల లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నవదీప్ ఓ పెయింటర్ అని, తనకు కావాల్సిన అమ్మాయి, తనకు కావాల్సిన ప్రేమ కోసం పలువురు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ట్రైలర్ లోనే కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. దీంతో సినిమాలో కూడా చాలా బోల్డ్ సీన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లిప్ కిస్ లు మాత్రమే కాక ఎక్స్‌పోజింగ్, మరిన్ని రొమాంటిక్ సీన్స్ లవ్ మౌళి సినిమాలో ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం.

Also Read : Sreeleela : అయ్య బాబోయ్.. ఆ స్కూల్స్ కోసం యాడ్ చేసిన శ్రీలీల.. నెటిజన్స్ నుంచి తీవ్ర విమర్శలు..

ఈ సీన్స్ వల్లే లవ్ మౌళి సినిమాకు సెన్సార్ ఇబ్బందులు వచ్చినట్టు తెలుస్తుంది. వీటిల్లో కొన్నిటికి సెన్సార్ బోర్డు మెంబర్స్ కత్తెర వేయాలని సూచించినట్టు, లవ్ మౌళి మూవీ టీం దానిపై ఆలోచిస్తున్నట్టు, అందుకే ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో లవ్ మౌళి సినిమా వాయిదా పడినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే లవ్ మౌళి సినిమాలో బోల్డ్ సీన్స్ వల్లే సెన్సార్ ఇబ్బంది వచ్చి సినిమా వాయిదా పడిందా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా మూవీ యూనిట్ కె తెలియాలి. ఇక ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో C స్పేస్, నైరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కించారు. నవదీప్ ఈ సినిమాతో రెండో వర్షన్ తో వస్తున్నాను అని, ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రమోట్ చేస్తున్నాడు.