Tollywood Producer Bandla Ganesh comments about conflict NTR
Bandla Ganesh : టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్.. 2009లో రవితేజ ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారారు. ఇక రెండు సినిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే నిర్మించారు. ‘తీన్‌మార్’తో ప్లాప్ ని అందుకున్న బండ్ల గణేష్.. మూడో సినిమా ‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్‌తో బాద్‌షా, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే సినిమాలు తెరకెక్కించారు.
చివరిగా ఎన్టీఆర్‌తో ‘టెంపర్’ తెరకెక్కించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ మూవీ తరువాత మరో సినిమాని నిర్మించలేదు. ఆ మూవీ టైములో రచయిత వక్కంతం వంశీ రెమ్యూనరేషన్ విషయంలో బండ్ల గణేష్ కోర్టు వరకు వెళ్లారు. ఈ గొడవ వల్లే ఎన్టీఆర్, బండ్ల గణేష్ మధ్య కూడా గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. తాజాగా దీని గురించి ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడారు. “ఎన్టీఆర్‌కి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. టెంపర్ తరువాత కూడా నేను ఆయనను చాలాసార్లు కలిశాను” అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
Also read : Bandla Ganesh : త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ కామెంట్స్.. నేను మనిషినే, నాకు కోపం వస్తుంది..
ప్రస్తుతం ఎన్టీఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయ్యిపోయారని, ఆయనతో తనకి ఏం విబేధాలు ఉంటాయని మాట్లాడారు. అలాగే మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. టెంపర్ తరువాత కూడా తానే నిర్మాతగా గ్యాప్ తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ గ్యాప్ కాస్త ఇప్పటివరకు మరో సినిమా తీయనంతగా మారుతుందని అనుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయట. స్టోరీ, హీరో ఫైనల్ అవ్వగానే ప్రకటించనున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్స్ కూడా పెద్ద హీరోలతోనే ఉంటుందని తెలియజేశారు.