Bandla Ganesh : త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ కామెంట్స్.. నేను మనిషినే, నాకు కోపం వస్తుంది..

త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నేను మనిషినే, నాకు కోసం వస్తుంది. నేనేమి స్వామీజీని కాదు కదా..

Bandla Ganesh : త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ కామెంట్స్.. నేను మనిషినే, నాకు కోపం వస్తుంది..

Bandla Ganesh comments about conflict with Trivikram Srinivas

Updated On : December 10, 2023 / 5:41 PM IST

Bandla Ganesh : టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భక్తుడిని చెప్పుకుంటుంటారు. అయితే పవన్, గణేష్ మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకు కారణం త్రివిక్రమే అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. బండ్ల గణేష్ కూడా సోషల్ మీడియాలో వేసే కొన్ని ట్వీట్స్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసినట్లు ఉండేవి. దీంతో బండ్ల గణేష్ వెర్సస్ త్రివిక్రమ్ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

త్రివిక్రమ్‌తో గొడవ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ సరస్వతి పుత్రుడు. ఆయనకి ఎవరైనా డీల్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఆయన పెద్ద మనిషి. ఆయన ముందు మనం ఎంత. ఆయన ఒకర్ని దూరం చేసే వ్యక్తి కాదు. ఒకవేళ ఆయన అలా దూరం చేసే పరిస్థితి వస్తే ఆ వ్యక్తి వేల్యూ లేని వ్యక్తే. అయితే ఒకరి దయతో బ్రతికే వ్యక్తిని నేను కాదు. మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు. మేము ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాము” అంటూ చెప్పుకొచ్చారు. మరి సోషల్ మీడియాలో గొడవ విషయం ఏంటని ప్రశ్నించారు.

Also read : Samuthirakani : సముద్రఖని ప్రధాన పాత్రలో.. ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్‌..

దానికి బండ్ల గణేష్ బదులిస్తూ.. “నాకు కోపం వచ్చినప్పుడు నా భార్యని బూతులు తిడతాను. అలాని ఆమె నా నుంచి విడిపోతుందా..? లేదు కదా. త్రివిక్రమ్ గారిని కూడా ఏదో ఒకసారి ఒకటి రెండు మాటలు అంటే నా మిత్రుడు కాకుండా పోతారా..? నేను మనిషినే కదా నాకు కోసం వస్తుంది. నేనేమి స్వామీజీని కాదు కదా. నాకు ప్రేమ కలిగినప్పుడు ప్రేమ చూపిస్తా. కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక టెంపర్ తరువాత మరో సినిమా చేయని ఈ నిర్మాత.. త్వరలోనే తన కొత్త సినిమాలను ప్రకటించనున్నారట. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయట. స్టోరీ, హీరో ఫైనల్ అవ్వగానే ప్రకటించనున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్స్ పెద్ద హీరోలతోనే ఉంటుందని తెలియజేశారు.