Samuthirakani : సముద్రఖని ప్రధాన పాత్రలో.. ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్..
అవినీతి మచ్చలేని ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ లో సముద్రఖని నటించబోతున్నారట.

Samuthirakani plays a lead role in political leader biopic
Samuthirakani : తమిళ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని గురించి ప్రత్యేకమైన ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అటు తమిళ్, ఇటు తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూనే వస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ నటుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు బయోపిక్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ బయోపిక్స్ పై ఆడియన్స్ కూడా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. తమ చుట్టూ ఉన్న లెజెండ్స్ గురించి తెలుసుకునేందుకు ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.
ఈ ఆసక్తిని గమనించిన పలువురు మేకర్స్.. చరిత్ర మర్చిపోతున్న కొందరి జీవితాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే అవినీతి మచ్చలేని ఓ రాజకీయ నాయకుడి కథని సముద్రఖనితో తెరకెక్కించడానికి పనులు మొదలయ్యాయని సమాచారం. పేద ప్రజల ఆశ కిరణంగా నిలిచినా ఆ నాయకుడు.. తన స్వంత ఇళ్ళుని కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఆ గొప్ప వ్యక్తి గురించి నేటి జనరేషన్ కి తెలియజేయాలని సముద్రఖని కూడా ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేశారట.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు త్వరలోనే సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. అయితే ఆ బయోపిక్ ఏ రాజకీయనాయకుడి జీవిత కథా అనే సందేహం మొదలైంది. తెలుగు రాష్ట్రానికి సంబంధించిన నాయకుడా..? లేదా తమిళ రాష్ట్రానికి చెందిన నాయకుడా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలు జవాబులు దొరకాలి అంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. సముద్రఖని ఇటీవలే పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ సినిమా తెరకెక్కించారు. ప్రస్తుతం భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటిస్తున్నారు.