Tollywood senior actor Murali Mohan real name details
Murali Mohan : టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్.. 1973లో వచ్చిన ‘జగమే మాయ’ సినిమాతో యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారు. గత ఏడాదితో నటుడిగా మురళీ మోహన్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. జగమే మాయ సినీ ప్రయాణం మొదలు పెట్టిన మురళీ మోహన్ కి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అంటే 1974లో రిలీజైన ‘తిరుపతి’. ఈ చిత్రాన్ని దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసారు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 350కి పైగా సినిమాల్లో నటించిన మురళీ మోహన్.. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. తన 100వ మూవీ ‘వారాలబ్బాయి’ సినిమాతో నిర్మాతగా మారిన మురళీ మోహన్.. దాదాపు 25 సినిమాలను ప్రొడ్యూస్ చేసారు. వీటిలో మహేష్ బాబు ‘అతడు’ కూడా ఉంది.
Also read : Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?
కాగా మనందరికి మురళీ మోహన్ గా పరిచయమైన ఈ నటుడు అసలు పేరేంటో తెలుసా..? ఈ విషయాన్ని మురళీ మోహన్ ఇటీవల అందరికి తెలియజేసారు. మురళీ మోహన్ తండ్రికి స్వాతంత్ర సమరయోధులంటే ఇష్టమంట. అంతేకాదు ఆయన కూడా స్వాతంత్ర ఉద్యమాలు చేశారట. దీంతో స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన పేర్లనే తమ పిల్లలకు కూడా పెట్టారట.
ఈక్రమంలోనే మురళీ మోహన్ కి ‘రాజారామ్మోహన్‌రాయ్’ అనే పేరుని పెట్టారు. అయితే స్కూల్ లో జాయిన్ అయ్యినప్పుడు ఆ పేరుని రాజబాబుగా మార్చుకున్నారట. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాక మరోసారి పేరు మార్చుకుంటూ.. మురళీ మోహన్ గా అందరికి పరిచయమయ్యారు. ఇలా రెండుసార్లు మురళీ మోహన్ తన పేరుని మార్చుకున్నారు. కాగా ఈయన ఇండస్ట్రీకి సమయానికి పెళ్లి అవ్వడమే కాదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట.