Naresh : ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసన్స్‌ కావాలంటూ ఎస్పీని కలిసిన నరేశ్‌..

సీనియర్ నటుడు నరేష్ తనకి తుపాకీ లైసన్స్‌ కావాలంటూ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డికి తన అభ్యర్ధనను తెలియజేశాడు.

tollywood senior actor Naresh request gun license for his life secure

Naresh : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్.. రీసెంట్ గా సూపర్ హిట్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. మళ్ళీ పెళ్లి, ఇంటింట రామాయణం, సామజవరగమన సినిమాలోని నరేష్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా నరేష్ తనకి తుపాకీ లైసెన్స్‌ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ ఇవ్వాలంటూ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డికి తన అభ్యర్ధనను తెలియజేశాడు.

Salaar : కేజీఎఫ్‌తో సలార్‌కి కనెక్షన్.. వైరల్ అవుతున్న పోస్ట్.. నీల్ సినిమాటిక్ యూనివర్స్!

ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేష్ ఇంటి పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న గచ్చిబౌలిలోని నరేష్ ఇంటిపై కొందరు దుండగులు దాడికి పాల్పడి ఇంటి ముందు పార్క్ చేసిన కారుని ధ్వంసం చేశారు. నరేష్ ఆ విషయం పై పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. మళ్ళీ ఇన్నిరోజులు తరువాత నరేష్ గురువారం (జులై 6) నాడు పుట్టపర్తి పోలీసులను ఆశ్రయించి తుపాకీ లైసెన్స్‌ కోసం అభ్యర్ధించడం చర్చనీయాంశం అయ్యింది.

Krithi Shetty : స్టార్ హీరో కొడుకు వేధింపులు.. కృతి శెట్టి రియాక్షన్ పోస్ట్ వైరల్..

కాగా నరేష్ మరియు అతని మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ తన సహా నటి పవిత్రా లోకేశ్ ని ఇటీవల పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత ఇద్దరు కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే పేరుతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాని తెరకెక్కించడం టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ సినిమాలో తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని, రిలీజ్ ని ఆపాలంటూ రమ్య రఘుపతి కోర్ట్ మెట్టులు కూడా ఎక్కింది.అయినా సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకోలేకపోయింది. ఓటీటీలో మాత్రం మంచి ప్రజాధారణ అందుకుంది.