Ramarao : టాలీవుడ్ నిర్మాత కన్నుమూత.. రాజేంద్రప్రసాద్ కి హిట్ ఇచ్చి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత..

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కన్నుమూశారు.

Tollywood Senior Producer Teeneteega Ramarao Passed Away

Ramarao : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ తో తేనెటీగ, వంశీ దర్శకత్వంలో నరేష్ – వాణి విశ్వనాధ్ లతో ప్రేమ & కో, శివకృష్ణతో బొబ్బిలివేట, బడి.. లాంటి పలు హిట్ సినిమాలు నిర్మించిన నిర్మాత జవ్వాజి వెంకట రామారావు మరణించారు.

Also Read : Sailesh Kolanu : ఫ్యామిలీతో ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్న శైలేష్ కొలను.. హిట్ 4 ఇప్పట్లో లేనట్టే.. మరి నెక్స్ట్ ఏంటి?

రాజేంద్రప్రసాద్ తేనెటీగ సినిమా హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఆయన పేరు తేనెటీగ రామారావుగా మారింది. తెలుగులోనే సినిమాలు నిర్మించడం కాక అనేక వేరే భాషల సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసారు. గత కొంతకాలంగా రామారావు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.