Geetha Madhuri : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతామాధురి..
టాలీవుడ్ సింగర్ గీతామాధురి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Tollywood Singer Geetha Madhuri gave birth to baby boy
Geetha Madhuri : టాలీవుడ్ సింగర్ గీతామాధురి.. తన గానంతో ఎంతో మంది మ్యూజిక్ లవర్స్ ని తన అభిమానులగా చేసుకున్నారు. లవ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, డివోషనల్.. ఇలా ఏ పాటైనా గీతా మాధుర్యంలో పడనంతవరుకే. ఒక్కసారి ఆమె రాగం అందుకున్నారంటే.. అది ఆమె వశం కావాల్సిందే. ఇదంతా గీతామాధురి ప్రొఫిషినల్ లైఫ్, ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ యాక్టర్ ‘నందు’ని ప్రేమ వివాహం చేసుకున్నారు.
2014లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహ బంధానికి గుర్తుగా 2019లో ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అనే పేరుని కూడా పెట్టారు. ఇక తాజాగా గీతామాధురి, నందు.. తమ రెండో బేబీకి ఆహ్వానం పలికారు. కొన్ని నెలలు క్రిందట గర్భం దాల్చిన గీతామాధురి.. ఇటీవలే సీమంతం వేడుకని కూడా ఘనంగా జరుపుకున్నారు. ఇక ఫిబ్రవరి 10న పండంటి మగబిడ్డకు జన్మనించారట.
Also read : Naga Chaitanya – Sai Pallavi : లవ్ స్టోరీలో సాయి పల్లవి, నాగచైతన్యకి నిజంగానే ముద్దు పెట్టిందా..!
View this post on Instagram
ఈ విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తూ గీతా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు వేశారు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గీతా, నందు పెళ్లి తరువాత చాలాసార్లు విడాకులు వార్తలు నెట్టింట హల్‌చల్ చేసాయి. కానీ ఈ జంట మాత్రం, ఆ వార్తల్ని అసలు పట్టించుకోకుండా.. తమ దాంపత్యంతోనే అందరికి సమాధానం చెబుతూ వస్తున్నారు.

Tollywood Singer Geetha Madhuri gave birth to baby boy