Mangli – Mukesh Ambani : ముకేశ్ అంబానీతో సింగర్ మంగ్లీ.. ఫోటో వైరల్.. ఎప్పుడు? ఎక్కడ కలిసిందో తెలుసా?

తాజాగా మంగ్లీ తన సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

Tollywood Singer Mangli Meets Mukesh Ambani in Waves Summit 2025

Mangli – Mukesh Ambani : సింగర్ మంగ్లీ తన పాటలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వేరే భాషల్లో కూడా పాడుతూ మరింత వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంగ్లీ సినిమా పాటలు, స్టేజ్ షోలు, యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్ తో బిజీగానే ఉంది. తాజాగా మంగ్లీ తన సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

ఇందులో ఇండియన్ టాప్ బిజినెస్ మెన్ ముకేశ్ అంబానీతో కూడా దిగిన ఫోటో ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. దీంతో మంగ్లీ ముకేశ్ అంబానీని ఎప్పుడు కలిసింది? ఎలా కలిసింది అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముంబైలో వేవ్స్ సమ్మిట్ అనే ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్ తో సహా అనేకమంది పాల్గొన్నారు.

Also Read : Komalee Prasad : ఈ హిట్ 3 భామ కూడా డాక్టర్ అని తెలుసా? న్యూయార్క్ మాస్టర్స్ అప్లికేషన్ చింపేసి.. సినిమాల్లోకి వస్తా అంటే వాళ్ళ నాన్న..

ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, అతని టీమ్ స్పెషల్ ప్రోగ్రాం చేశారు. ఆ టీమ్ లో మంగ్లీ వెళ్ళింది. దీంతో మంగ్లీ అక్కడ వేవ్స్ సమ్మిట్ లో పర్ఫార్మ్ చేసింది. ఆ సమ్మిట్ కి అన్ని పరిశ్రమల నుంచి చాలా మంది స్టార్స్ రావడంతో వాళ్ళతో మంగ్లీ ఫొటోలు దిగింది. ముకేశ్ అంబానీ కూడా ఈ సమ్మిట్ కి గెస్ట్ గా రావడంతో ఆయనతో కూడా ఫోటో దిగింది మంగ్లీ.

అలాగే జాకీ ష్రాఫ్, కుష్బూ, సోను నిగమ్, శ్రీలీల, శ్రేయ ఘోషల్, చిరంజీవి, చిత్ర, అనుపమ్ ఖేర్.. లాంటి పలు స్టార్స్ తో ఫొటోలు దిగి షేర్ చేసింది మంగ్లీ. మొత్తానికి ఓ నేషనల్ ఈవెంట్ కి వెళ్లి మంగ్లీ అక్కడ సెలబ్రిటీలందరితో ఫొటోలు దిగి ఈవెంట్లో పెర్ఫార్మ్ చేసి సందడి చేసింది.

Also See : Express Hari : టీవీ ఆర్టిస్ట్, పటాస్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?