KK Senthil Kumar : RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య మరణం..

టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహీ నేడు కన్నుమూశారు.

KK Senthil Kumar : RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య మరణం..

Tollywood Star cinematographer KK Senthil Kumar wife passed away

Updated On : February 15, 2024 / 7:39 PM IST

KK Senthil Kumar : టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకుంది. ఆయన భార్య ‘రూహీ’ నేడు కన్నుమూశారు. రూహీ ప్రొఫిషినల్ యోగ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం కంటే ముందు.. రూహీ, అనుష్క కలిసి యోగ టీచర్స్ గా పని చేశారు. కాగా రూహీ ఆరోగ్యం కరోనా సమయంలో దెబ్బతిందట. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో పోరాడుతూ వస్తున్నారట.

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ వస్తున్న రూహీ.. శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినడంతో.. నేడు ఫిబ్రవరి 15 మధ్యాహ్నం హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. రేపు ఉదయం 9 గంటలకు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వార్త ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను బాధకి గురి చేస్తుంది. ముఖ్యంగా రాజమౌళి కుటుంబసభ్యులను ఈ విషయం బాగా బాధిస్తుంది.

Also read : Vishwak Sen : విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి.. నాగచైతన్య హీరోగా సెలెక్ట్.. ఏ మూవీ..?

ఎందుకంటే, రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు సెంథిల్ కెమెరా నుంచి పుట్టినవే. రాజమౌళి విజన్ ని సెంథిల్ బాగా అర్ధం చేసుకొని, ఆడియన్స్ కి స్క్రీన్ పై గొప్పగా చూపిస్తారు.