tollywood star fight masters Ram Lakshman help for chirala old age home
Ram Lakshman : టాలీవుడ్ (Tollywood) స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం అభిమానించే హీరోలను తెర పై చాలా పవర్ ఫుల్ గా చూపించడానికి ఎంతో కష్ట పడుతుంటారు. సౌత్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ అన్నదమ్ములు రీసెంట్ గా చేసిన ఒక పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని (Andhra pradesh) చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు. అదేంటి సినిమా స్టార్స్ అయ్యుండి బిక్షాటన చేయడం ఏంటని అనుకుంటున్నారు. అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది.
Prabhas : ప్రభాస్ లుక్స్ పై నటి కస్తూరి వైరల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న రెబల్స్!
అసలు విషయం ఏంటంటే.. చీరాలలో ‘కోటయ్య వృద్ధాశ్రమం’ ఉంది. అయితే వారికి ఒక ఆటో అవసరం అయ్యింది. ఆ ఆశ్రమవాసులకు ఆటో కొనిచ్చేందుకు చీరాలలోని ప్రధాన రహాదారుల్లో జోళి పట్టి బిక్షాటన చేసి ప్రజలు నుంచి నగదు సేకరించారు. ఆ వచ్చిన డబ్బుతో పాటు తమ అకౌంట్స్ నుంచి మరికొంత నగదుని కలిపి ఆ ఆశ్రమానికి అందించారు. అదేంటి సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇలా బిక్షాటన చేయడం ఎందుకు, పబ్లిసిటీ కోసమా అని అనుకుంటున్నారా..?
Adipurush : ఆదిపురుష్ సీత ముద్దు వ్యవహారం పై.. రామాయణం సీరియల్ సీత కామెంట్స్..
అయితే మీరు తప్పుగా ఆలోచిస్తునట్లే. రామ్ లక్ష్మణ్ అలా చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ప్రజల్లో సేవ కార్యక్రమాల పై అవగాహన కలిపించేందుకు, అలాగే వారిని ఒక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు రామ్ లక్ష్మణ్ జోళి పట్టి బిక్షాటన చేశారు. అనంతరం కోటయ్య వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు చేసిన పనికి నెటిజెన్లు సెల్యూట్ చేస్తున్నారు.