ఈ స్టార్ క్యూట్ కిడ్స్ క్రేజ్ చూశారా!..

Star Kids: టాలీవుడ్‌లో స్టార్ హీరో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంది ఈ స్టార్ కిడ్స్ సోషల్ మీడియా ఫాలోయింగ్. స్టార్ హీరో పిల్లలైనా.. ఏమాత్రం తగ్గకుండా తండ్రి స్టార్ డమ్‌కి రీచ్ అయ్యేలానే ఉంది ఈ కూతుళ్ల క్రేజ్. మరి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్న ఇద్దరు స్టార్ కిడ్స్ ఎవరో.. వాళ్ల సందడేంటో చూద్దాం.
మహేష్ ముద్దుల కూతురిగా, సీతాపాపగా సితారకు ఫుల్ క్రేజ్ ఉంది. మహేష్, నమ్రత కూడా సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతుంటారు. అయితే ఈ సోషల్ మీడియాలో తమ అకౌంట్స్ ట్విట్టర్, ఇన్‌స్టా ల్లో సితార వీడియోస్, ఫోటోస్ పెడుతుంటారు. మరి ఇంత క్యూట్‌గా ఉండే సితారను చూసి అభిమానులు మురిసిపోకుండా ఉంటారా.. అందుకే సీతాపాపకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
సితార ఓన్‌గా సోషల్ మీడియా క్రియేట్ చెయ్యడంతో పాటు అప్డేట్స్ పోస్ట్ చేసే విషయంలో సూపర్ ఫాస్ట్‌గా ఉంటోంది. లేటెస్ట్‌గా సితార స్పీడ్ బోట్ వీడియో సూపర్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్‌కి వెకేషన్ కోసం వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. అక్కడ బీచ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సితార, అక్కడ ఫుల్‌గా ఎగ్జైట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో మహేష్ ఫ్యాన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది.
View this post on Instagram
సితార కన్నా చిన్నదైన అల్లు అర్హా కూడా ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అల్లు అర్జున్ అందాల కూతురైన అర్హా క్యూట్ వీడియోలు, ఫోటోలు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. లేటెస్ట్‌గా పింక్ లాంగ్ ఫ్రాక్‌తో గార్డెన్‌లో దిగిన ఫోటోని షేర్ చేసింది బన్నీ భార్య స్నేహా. ‘మై ప్రిన్సెస్’ అని పెట్టిన ఈ ఫోటోకి బన్నీ.. ‘సో క్యూట్’ అంటూ రీ ట్వీట్ చేశారు. ఇలా స్టార్ కిడ్స్ అయినా కూడా వాళ్లతో పాటే ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంటున్నారు ఈ క్యూట్ లిటిల్ డాటర్స్..
View this post on Instagram