×
Ad

Tollywood Stars : కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న చిరు – నాగ్ – వెంకీమామ.. బాలయ్య బాబు మిస్సింగ్..

తాజాగా సీనియర్ స్టార్ హీరోలు కలిసి కనిపించారు. (Tollywood Stars)

Tollywood Stars

Tollywood Stars : మన హీరోలు కలిసి కనిపిస్తే ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆనందంగా ఫీల్ అవుతారు. హీరోలు కలిసి ఒకేచోట కనిపిస్తే ఆ ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే. తాజాగా సీనియర్ స్టార్ హీరోలు కలిసి కనిపించారు. ఇటీవల చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య ఎవరో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి కనిపిస్తూనే ఉన్నారు కానీ నలుగురూ ఒకే ఫ్రేమ్ లో కనిపించట్లేదు.(Tollywood Stars)

తాజాగా నేడు దీపావళి రోజు చిరంజీవి ఇంట్లో స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి వెంకటేష్ తన భార్య నీరజతో, నాగార్జున తన భార్య అమలతో హాజరయ్యారు. వీరికి చిరంజీవి, సురేఖ కలిసి స్పెషల్ గిఫ్ట్స్ అందచేశారు. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు చిరంజీవి.

Also Read : Diwali 2025 : సీనియర్ స్టార్ హీరోల ఫ్యామిలీలు.. దీపావళి స్పెషల్.. ఎవరెవరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారంటే..

అలాగే ఈ ముగ్గురు కలిసి ఫోటో దిగారు. దీంతో చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి ఇందులో బాలయ్య బాబు కూడా ఉంటే బాగుండు, సీనియర్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాగుండు, బాలకృష్ణ మిస్సింగ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల బాలయ్య 50 ఏళ్ళ నట వేడుకల్లో చిరంజీవి, వెంకటేష్, బాలయ్య ఉండగా నాగార్జున మిస్ అయ్యారు. గత కొన్నాళ్లుగా ఏదో ఒక ఈవెంట్లో ఈ నలుగురిలో ఎవరో ఇద్దరు లేదా ముగ్గురు కలుస్తున్నారు కానీ నలుగురు కలిసి కనిపించట్లేదు. మరి గత జనరేషన్ టాలీవుడ్ పిల్లర్స్ అయిన ఈ నలుగురు ఎప్పుడు కలిసి కనిపిస్తారో చూడటం కోసం ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు..

Also See : Nabha Natesh : దీపావళి స్పెషల్.. దీపాల వెలుగుల్లో చీరకట్టులో నభా నటేష్ మెరుపులు..