Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేక వీడియో.. ఆ హీరోలు, దర్శకులు!

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరణం గురించి టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఆయనకి నివాళులు అర్పించారు.

Tollywood Writer Paruchuri Gopalakrishna comments on Rakesh Master demise

Rakesh Master : ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఎంతోమందిని ప్రోత్సహించి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే కొన్నాళ్ల క్రితం మానసికంగా దెబ్బతినడంతో మందుకి అలవాటు పడి, హెల్త్ ని పాడు చేసుకున్నారు. ఇక ఈయన మరణం తోటి డాన్సర్స్ తో పాటు పలువురు ప్రముఖులను కూడా తీవ్రంగా బాధించింది. తాజాగా రాకేష్ మరణం గురించి టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ పరుచూరి పలుకుల్లో (Paruchuri Palukulu) భాగంగా ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఆయనకి నివాళులు అర్పించారు.

Siddu Jonnalagadda : ఆరుగురు నేషనల్ అవార్డు విన్నెర్స్‌తో డీజే టిల్లు మూవీ.. నిజమేనా?

రాకేశ్‌ మాస్టర్‌ గురువైన ముక్కురాజు గారితో ఎన్నో సినిమాలకు కలిసి పని చేసిన పరుచూరి.. రాకేశ్‌ మాస్టర్‌తో మాత్రం ఎక్కువగా పనిచేయలేదని తెలియజేశారు. అయితే ఢీ, జబర్దస్త్‌ వంటి షోల్లో ఆయన్నని ఎక్కువుగా చూసినట్లు, ఇప్పుడు సడన్ గా ఆయన లేరన్న మాట తనని షాక్ కి గురి చేసినట్లు వెల్లడించారు. ఇక ఇటీవల రాకేష్ మాస్టర్ తనయుడు మీడియా ముందు.. ‘మా నాన్న గురించి ఇప్పటికైనా మాట్లాడడం మానేయండి’ చేసిన వ్యాఖ్యలు తన కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసేయని చెప్పుకొచ్చారు.

Rajat Bedi : హృతిక్ క్రిష్ 1 తీవ్రంగా నిరాశపరిచింది.. అందుకే సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోయా.. రజత్ బేడీ!

“1500 పాటలకు కొరియోగ్రాఫర్‌గా చేసిన రాకేశ్‌ మాస్టర్‌ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ వంటి ఇద్దరు అద్భుతమైన కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి అందించారు. మానసికంగా దెబ్బతిన్న రాకేష్ మాస్టర్ తన ఆవేదనను తనదైన శైలిలో వెలిబుచ్చారు. ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను. వాటిలో ఆయన తన ఆవేదనని వ్యక్తం చేసేవారు. దానిని అర్ధం చేసుకొని ఆయన జీవితానికి ఒక మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం ఎవరు చేయలేదు. అప్‌కమింగ్‌ హీరోలు మరియు దర్శకుల్లో ఎవరొకరు తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేది” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మనకి అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బాధ పడుతూ కూర్చోకుండా మరో మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి అంటూ ఇప్పటి యువతకి తెలియజేశారు.