Pavan Sadineni : మోసం చేశాడంటూ నటి ఫిర్యాదు.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్టు..
టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాధినేనిని (Pavan Sadineni) పోలీసులు అరెస్ట్ చేశారు
Tollywood young Director Pawan Sadineni arrested
Pavan Sadineni: టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాధినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడంటూ ఓ నటి గోల్కొండ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పవన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
2013లో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి వంటి సినిమాలతో మెప్పించాడు. పిల్ల, ఈ ఆఫీసులో, కమిట్‌మెంటల్, దయా వంటి వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. అతడు ఇప్పుడు ఇలా అరెస్ట్ కావడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Iswarya Menon : చూపులతో మత్తెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్.. ఫోటోలు వైరల్..
ప్రస్తుతం ఆయన మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆకాశంలో ఒక తార అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సాత్విక వీరవల్లి, పూజా హెగ్డే, శృతి హాసన్ కథానాయికలు కాగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
