Toxic: Introducing Raya
Toxic: Introducing Raya : కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్న యశ్ నెక్స్ట్ సినిమా టాక్సిక్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ డైరెక్షన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కన్నడతో పాటు, ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేడు యశ్ పుట్టిన రోజు సందర్భంగా టాక్సిక్ లో యశ్ పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు.
ఈ గ్లింప్స్ అంతా హాలీవుడ్ సినిమాలాగే టేకింగ్, ఇంగ్లీష్ లోనే ఉండటం గమనార్హం. గ్లింప్స్ లో వైల్డ్ రొమాన్స్, వైల్డ్ యాక్షన్ చూపించారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. యాష్ టాక్సిక్ సినిమా మార్చ్ 19న పాన్ ఇండియా తో పాటు హాలీవుడ్ లో కూడా రిలీజ్ కానుంది.
మీరు కూడా టాక్సిక్ గ్లింప్స్ చూసేయండి..
Also Read : Prabhas : ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా? నేషనల్ మీడియాకు గట్టి సమాధానం ఇచ్చిన మారుతి..