Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’కి ట్రాఫిక్ కష్టాలు…

భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ సందర్భంగా ఈరోజు మద్యహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో విధించి వాహనాలను వేరే దారుల్లో..........

Bheemla Nayak

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఆ ఏరియాలో ఏ ఈవెంట్ జరిగినా ట్రాఫిక్ కష్టాలు తప్పవు. హైదరాబాద్ లో సాయంత్రం సమయంలో సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది. ఇటీవల ‘పుష్ప’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే గ్రౌండ్స్ లో జరిగింది. అప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధించకపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కష్టాలు ఏర్పడ్డాయి.

‘పుష్ప’ సినిమా అనుభవంతో ఇవాళ జరిగే ఈవెంట్ కి ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ సందర్భంగా ఈరోజు మద్యహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో విధించి వాహనాలను వేరే దారుల్లో మళ్లిస్తున్నారు. అయినా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పట్లేదు. ఇప్పటికే పవన్ అభిమానులు భారీగా సభ వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయింది. వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ఐదో షోకు గ్రీన్ సిగ్నల్

ఈ ట్రాఫిక్ జామ్ తో ఈవెంట్ కి వచ్చే ప్రముఖులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నట్టు సమాచారం. దీంతో యూసుఫ్ గూడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ తో ఈవెంట్ మరింత ఆలస్యం అవ్వనుంది.