Tribanadhari Barbarik : మా సినిమాకు టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం.. ఉదయభాను రీ ఎంట్రీ సినిమా గురించి నిర్మాత ఏమన్నారంటే..

త్రిబాణధారి బార్బరిక్ ఆగస్ట్ 29న రిలీజ్ కానుండగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.Tribanadhari Barbarik)

Tribanadhari Barbarik

Tribanadhari Barbarik : డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా త్రిబాణధారి బార్బరిక్. సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.(Tribanadhari Barbarik)

నటి, ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తూనే నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతుంది. త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్ట్ 29న రిలీజ్ కానుండగా తాజాగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.

Also Read : Prabhas : ప్రభాస్ సినిమాకు మళ్ళీ ఇబ్బందులు..? సంక్రాంతికి కూడా డౌటేనా? షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మోహన్ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ చిన్న బడ్జెట్‌తో సినిమా తీయాలను అనుకున్నాము కానీ మారుతి గారిని కలిసాక ఇంకా బెటర్ గా తీయమని చెప్పడంతో భారీగా ప్లాన్ చేసాము. ఇది ఒక కొత్త కథ. థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ కథను మైథలాజికల్ జానర్‌ను యాడ్ చేసి చెప్పడమే కొత్తగా ఉంటుంది.

ముందు మోహన్ లాల్, అమితాబ్ అనుకున్నాము ఈ సినిమాలో మెయిన్ రోల్ కి తర్వాత సత్య రాజ్ గారితో వెళ్ళాము. ఆయన వర్షంలో, చీకట్లో, స్మశానంలో బాగా కష్టపడి చేసారు. ఉదయభాను గారి రీ ఎంట్రీ బాగుంటుంది. ఆడియెన్స్ కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లనే ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆదరిస్తారు. ఈ సినిమాతో తెలుగులో మొదటిసారి ఓ మ్యూజిక్ బ్యాండ్ ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌ తో మ్యూజిక్ చేయించాము. త్రిబాణాస్త్రంలోని అసలు అర్థాన్ని చెప్పేలా, మంచి మెసెజ్ ఇచ్చేలా మా సినిమాను తెరకెక్కించాం అని తెలిపారు.

Also Read : Dhee Pandu : త్రివిక్రమ్ సర్ వైఫ్ కి నా సాంగ్ చాలా ఇష్టం.. గుంటూరు కారం షూట్ లో ఆయన పిలిచి..

మారుతి గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తరువాత మారుతి గారు చాలా సంతృప్తి చెందారు. సినిమా హిట్ అవుతుంది అన్నారు. ఆయన మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ తోనే ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో సినిమా బ్యూటీ అని మొదలుపెట్టాము. అది కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇంకో రెండు కథలను కూడా ఫైనల్ చేసాము అని తెలిపారు.

ఇటీవల ఈ సినిమా ప్రీమియర్స్ వేయగా దానికి వచ్చిన స్పందన గురించి చెప్తూ..

కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు అన్ని ప్రాంతాలకు సినిమా రీచ్ అవ్వాలనే వరంగల్, విజయవాడలో ఈ సినిమా ప్రీమియర్స్ ఫ్రీగా వేసాము. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసి చాలా మంది ఏడ్చారు. ఒక పెద్దాయన ఈ సినిమా ఫ్రీగా చూసి ఇది ఫ్రీగా చూడాల్సిన సినిమా కాదు అని మాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. అది మాకు పెద్ద కాంప్లిమెంట్. అందుకే ఈ సినిమా అందరికి రీచ్ అవ్వాలని టికెట్ రేట్లు ఉన్నదానికంటే తగ్గించి 150 రూపాయలు మాత్రమే పెడుతున్నాము. మల్టీప్లెక్స్ లలో కూడా ఇదే రేటు ఉంటుంది అని తెలిపారు.