Chaurya Paatam : ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్.. 120 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ తో..
చౌర్య పాఠం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల అయింది.

Trinatha Rao Nakkina Chaurya Paatam Movie Streaming in Amazon Prime OTT
Chaurya Paatam : ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మాణంలో నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చౌర్య పాఠం’. రాజీవ్ కనకాల, సలీం ఫేకు, సుప్రియ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. చౌర్య పాఠం సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా నెల రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చింది.
చౌర్య పాఠం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల అయింది. ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే 100 మిలియన్ కాదు ఏకంగా 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని దాటేసి మరింత దూసుకుపోతుంది. స్టార్ల హంగామా, భారీ సెట్టింగుల ఆర్భాటం లేకపోయినా థ్రిల్లింగ్ కథతో ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read : Vijay Deverakonda : ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. తాజాగా విజయ్ పై sc, st అట్రాసిటీ కేసు నమోదు..
డైరెక్టర్ అవ్వాలని కలలు కంటున్నా వ్యక్తి సినిమా నిర్మించుకోడానికి డబ్బులు అవసరమై ఓ ధనిక గ్రామంలో దొంగతనం చేయాలని కొంతమందితో కలిసి ప్లాన్ చేస్తాడు. కానీ ఆ గ్రామంలో వీరికి ఎదురైనా సంఘటనలు ఏంటి? దొంగతనం చేసారా? ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది క్రైమ్ థ్రిల్లర్ లా తెరకెక్కించారు చౌర్యపాఠం సినిమాని.