Vijay Deverakonda : ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. తాజాగా విజయ్ పై sc, st అట్రాసిటీ కేసు నమోదు..
రాయదుర్గం పోలీసులు విజయ దేవరకొండ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.

SC ST Atrocity Case Filed on Vijay Deverakonda Regarding Retro Event Comments
Vijay Deverakonda : ఏప్రిల్ లో రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాగా అప్పుడు పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఘటనల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. అలా మాట్లాడుతూ కొన్ని వేల ఏళ్ళ క్రితం ట్రైబ్స్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు అని అన్నారు. అయితే దీనిపై అప్పుడే పలువురు గిరిజన సంఘాలు స్పందించి ట్రైబల్స్ ని ఉగ్రవాదులతో పోలుస్తారా అని విమర్శలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
విజయ్ దేవరకొండ ఈ వివాదంపై అప్పుడే స్పందిస్తూ తన సోషల్ మీడియాలో.. నేను చేసిన వాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. ఏ వర్గాన్నీ, ఏ తెగను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను. భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటే అని భావిస్తాను. నేను ఏ సమూహం పై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉండే క్షమించండి. నేను శాంతి, ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను. ట్రైబ్ అనే పదాన్ని నేను వేరే సెన్స్ లో ఉపయోగించాను. దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటూ క్లారిటీ ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గిరిజన సంఘాలు ఈ అంశంపై ఫిర్యాదు చేసాయి. రెట్రో ఈవెంట్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు విజయ దేవరకొండ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025