Chiranjeevi – Trisha : అందరూ అనుకున్నట్టే.. చిరంజీవి సరసన త్రిష.. 18 ఏళ్ళ తర్వాత..
త్రిష, చిరంజీవి విశ్వంభర మూవీ సెట్స్ లో కలుసుకున్న వీడియోని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Trisha playing Female Lead in Chiranjeevi Vishwambhara Movie Video goes Viral
Chiranjeevi – Trisha : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన 156వ సినిమాగా ప్రస్తుతం వశిష్ఠ(Director Vassishta) దర్శకత్వంలో ‘విశ్వంభర'(Vishwambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఆల్రెడీ చిరంజీవి లేని సీన్స్ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఇటీవలే చిరంజీవి విశ్వంభర సెట్స్ లోకి అడుగు పెట్టారు. కొన్ని రోజుల క్రితమే జిమ్ లో బాగా కష్టపడుతున్న వీడియోని షేర్ చేసి విశ్వంభర మొదలుపెడుతున్నాను అని చిరంజీవి పోస్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తున్నట్టు అధికారికంగా అప్రకటించారు. త్రిష కూడా విశ్వంభర సెట్స్ లోకి అడుగు పెట్టగా చిరంజీవి, మూవీ యూనిట్ త్రిషకు వెల్కమ్ చెప్పారు.
Also Read : Baby Movie : ‘బేబీ’ సినిమా రెండు భాషల్లోకి రీమేక్.. వాలెంటైన్ డేకి స్పెషల్ అప్డేట్..
త్రిష, చిరంజీవి విశ్వంభర మూవీ సెట్స్ లో కలుసుకున్న వీడియోని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత కొన్ని రోజులుగా త్రిష ఈ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా అదే ప్రకటించారు. ఇక చిరు, త్రిష కలిసి 18 ఏళ్ళ క్రితం స్టాలిన్ సినిమాలో నటించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు విశ్వంభరలో మళ్ళీ కలిసి నటిస్తున్నారు.
Welcome on board
The Gorgeous @trishtrashers ! #Vishwambhara pic.twitter.com/wqXUQF4gZH— Chiranjeevi Konidela (@KChiruTweets) February 5, 2024