Trisha Birthday: త్రిష బర్త్ డే.. విశ్వంభర మూవీ నుంచి స్పెషల్ పోస్టర్.. సినిమా విడుదల ఎప్పుడంటే?
త్రిష బర్త్ డే(Trisha Birthday) సందర్బంగా విశ్వంభర మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్.
trisha special poster released from Vishwambhara movie on her birthday.
Trisha Birthday: స్టార్ బ్యూటీ త్రిష పుట్టినరోజు (మే 4) సందర్భంగా ‘విశ్వంభర’ మేకర్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో త్రిష(Trisha Birthday) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ స్టార్ హీరోయిన్ త్రిషకు విషెస్ చెబుతూ సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేశారు.
Vijay- Ntr: తమిళనాట విజయ్ ప్రభంజనం.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్
ఈ సినిమాలో త్రిష ‘అవని’ అనే పాత్రలో నటించబోతుంది. చేతిలో హారతి పళ్లెంతో పద్దతిగా సాంప్రదాయ లుక్ లో ఆమె కనిపించిన తీరు ఆడియన్స్ ఆకర్షిస్తోంది. దీంతో, విశ్వంభర నుంచి వచ్చిన త్రిష పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అలాగే సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. గత సంవత్సర కాలంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జులై నెలలో ఈ భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
