Trivikram Doing For The First Time In Mahesh Babu Movie
Trivirkam: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పనులు మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Trivikram Mahesh Babu Movie: అలా ఆ టీమ్‌ను మళ్లీ వాడుతున్న త్రివిక్రమ్..?
కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మునుపెన్నడూ చేయని ఓ పని చేస్తున్నాడట. మనకు త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ అనేది కనిపించదు. అలాంటిది, ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఓ స్పెషల్ హాట్ ఐటెం సాంగ్‌ను పెట్టబోతున్నాడట ఈ డైరెక్టర్. పుష్ప సినిమాలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ చేసిన ‘ఊ అంటావా..’ అనే హాట్ ఐటెం సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే.
Trivikram Mahesh Babu Movie: అలా ఆ టీమ్‌ను మళ్లీ వాడుతున్న త్రివిక్రమ్..?
అందుకే ఇప్పుడు మహేష్ బాబు సినిమాలోనూ ఇలాంటి పాట ఒకటి పెడితే, ప్రేక్షకులను ఎంగేజ్ చేయొచ్చని ఆయన భావిస్తున్నాడట. మరి మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ ఎవరితో ఐటెం సాంగ్ చేయిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తొలిసారి త్రివిక్రమ్ ఇలా ఓ ఐటెం సాంగ్‌ను తన సినిమాలో పెడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.