Vijay – Trivikram : విజయ్‌ని హగ్ చేసుకొని.. తక్కువ టైంలో ఎంత ప్రేమ చూశాడో అంత ద్వేషం చూసాడు.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు వైరల్..

త్రివిక్రమ్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Trivikram Hugged Vijay Devarakonda and Interesting Comments about Vijay

Vijay – Trivikram : దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.

Also Read : Hyper Aadi : పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో లక్షల మంది సపోర్ట్ ఎంత ఉందో.. ఫ్రెండ్ గా త్రివిక్రమ్ గారి సపోర్ట్ కూడా అంతే ఉంది..

అయితే ఈ ఈవెంట్లో త్రివిక్రమ్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్రివిక్రమ్ విజయ్ దేవరకొండని దగ్గరకు తీసుకొని.. నా ఫేవరేట్ యాక్టర్స్ లో ఒకరు విజయ్. విజయ్ ఎంతో ప్రేమని చూసాడు అంతకంటే ఎక్కువ ద్వేషం కూడా చూసాడు. చాలా తక్కువ టైంలో ఈ రెండు చూసాడంటే చాలా గట్టివాడే విజయ్. లైఫ్ లో ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

విజయ్ దేవరకొండ వరుస హిట్స్, వరుస ఫ్లాప్స్ చూడటం, విజయ్ స్పీచ్ లతో పలువురు సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు చేయడం.. ఇలాంటి వాటి మీదే త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేసాడని అర్ధమవుతుంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను మరింత వైరల్ చేస్తున్నారు.