Guntur Kaaram Collections : గుంటూరు కారం కలెక్షన్స్ జోరు.. రెండో రోజు ఎంతంటే..?

గుంటూరు కారం కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండో రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంతంటే..?

Trivikram MaheshBabu Guntur Kaaram Movie Second Day Collections Details

Guntur Kaaram Collections : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ భారీ అంచనాలు మధ్య జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలతో పండక్కి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ షోలతో భారీ ఓపెనింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక్క భాషలోనే రిలీజయిన ఓ రీజనల్ సినిమా మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. ఇక రెండు రోజు వెంకటేష్ ‘సైంధవ్‌’తో పాటు ‘హనుమాన్’తో స్క్రీన్స్ షేర్ చేసుకున్న గుంటూరు కారం.. కలెక్షన్స్ జోరు మాత్రం బాగానే ఉంది.

Also read : Nagarjuna : మాల్దీవ్స్ లీడర్స్ అన్న మాటలు చాలా తప్పు.. వెకేషన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా..

రెండు రోజులకు ఈ చిత్రం 127 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. రీజినల్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం రికార్డు అనే చెప్పాలి. ఇక అటు అమెరికాలో కూడా రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. రెండు మిలియన్ పైగా గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఈ పండగ మూడు రోజులు గుంటూరు కారం కలెక్షన్స్ జోరు ఒకేలా సాగేలా కనిపిస్తుంది. దీంతో ఈ పండుగ సమయంలోనే 250 కోట్ల పైగా కలెక్షన్స్ దాటొచ్చు అని అభిమానులు భావిస్తున్నారు.

కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 130 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 270 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. షేర్ కలెక్షన్స్ 135 కోట్లకు పైగా ఉండాలి. ఈ కలెక్షన్స్ ని అందుకోవడం గుంటూరు కారంకి పెద్ద కష్టం ఏమి అనిపించడం లేదు. ఇక ఈ కలెక్షన్స్ తో తెలుగు రీజనల్ సినిమాకి మహేష్ మళ్ళీ మంచి గుర్తింపు తీసుకు వచ్చారు.