Nagarjuna : మాల్దీవ్స్ లీడర్స్ అన్న మాటలు చాలా తప్పు.. వెకేషన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా..

మాల్దీవ్స్ లీడర్స్ అన్న మాటలు చాలా తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున. అక్కడికి వెళ్లాల్సిన వెకేషన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా అంటూ..

Nagarjuna : మాల్దీవ్స్ లీడర్స్ అన్న మాటలు చాలా తప్పు.. వెకేషన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా..

Nagarjuna

Updated On : January 14, 2024 / 12:13 PM IST

Nagarjuna : ఈ సంక్రాంతికి అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో వచ్చారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మార్నింగ్ షోల్లో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ఆడియన్స్ లోకి రీచ్ అవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే ఆస్కార్ ద్వయం కీరవాణి, చంద్రబోస్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో మాల్దీవ్స్ ఇష్యూకి సంబంధించి చర్చ జరిగింది. గత కొన్ని రోజులుగా బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లక్షద్వీప్ గురించి మన దేశప్రధాని మోదీ వేసిన పోస్ట్ పై మాల్దీవ్స్ లీడర్స్ చేసిన వ్యాఖ్యలను ఇండియన్స్ ఆగ్రహానికి గురయ్యాయి. దీంతో సాధారణ ప్రజలు నుంచి సినిమా సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే నినాదం అందుకున్నారు.

ఈక్రమంలోనే నాగార్జున కూడా ఆ నినాదానికి జై కొట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ.. “నా సామిరంగ సినిమాలో తీర్థ యాత్రలకు రామేశ్వరం, కాశీ అంటూ మనం ఓ పాటని ఇందులో పెట్టాము. మరి మీరు తీర్థయాత్రలకు మాల్దీవ్స్ ఏమన్నా వెళ్తారా” అంటూ బాయ్‌కాట్ మాల్దీవ్స్ ని చర్చకి తీసుకు వచ్చారు.

Also read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ.. సంక్రాంతి పండక్కి పండగలాంటి సినిమా..

ఇక ఈ ప్రశ్నకు నాగార్జున బదులిస్తూ.. “నేను నిజం చెప్పాలంటే ఈ నెల 17న మాల్దీవ్స్ కి వెళ్లాల్సిన నా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నా. బిగ్‌బాస్, నా సామిరంగ షూటింగ్స్ ఫ్యామిలీని దూరం పెట్టాను. దీంతో కొన్ని రోజులు మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళాలి అనుకున్నా. కానీ ఇప్పుడు విరమించుకున్నా. ఎవరు ఏం అంటారు అని భయంతో క్యాన్సిల్ చేసుకోలేదు. మాల్దీవ్స్ లీడర్స్ అన్న మాటలు నాకు చాలా తప్పు అనిపించాయి. ఇన్ని కోట్ల ప్రజల్ని పరిపాలించే ప్రధాని పై వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, ట్వీట్స్, స్టేట్‌మెంట్స్ కరెక్ట్ కాదు. దానికి పర్యావసానం కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. మాల్దీవ్స్ కన్నా లక్షదీప్ వెళ్ళడానికే నా ఓటు కూడా” అంటూ నాగ్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.