Sai Soujanya : నిర్మాతగా సినిమాల్లో త్రివిక్రమ్ వైఫ్ వర్క్ ఏంటో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.

Trivikram Wife Sai Soujanya Work in Movies as Producer

Sai Soujanya :  త్రివిక్రమ్(Trivikram) దర్శకుడిగా సక్సెస్ అయిన తర్వాత కేవలం నిర్మాత చినబాబుతోనే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నీ కేవలం హారికా హాసిని క్రియేషన్స్ లోనే వస్తాయి. ఆ సంస్థ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ అనే మరో బ్యానర్ స్థాపించి చిన్నా, పెద్ద.. బోలెడన్ని సినిమాలు వరుసగా తీస్తున్నారు నిర్మాత నాగవంశీ.

ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయే. దీంతో సినిమా నిర్మాణాల్లో ఆవిడ కూడా భాగమైంది. ధనుష్ సర్ సినిమా టైములో కొన్ని సార్లు బయటకి వచ్చి ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు సాయి సౌజన్య. నిర్మాతగా పేరు పడుతున్నా ఎక్కువగా బయట మాత్రం కనపడట్లేదు సాయి సౌజన్య.

Also Read : Guntur Kaaram : టైం, క్వాలిటీ గురించి ఆలోచించి.. గుంటూరు కారం రిలీజ్ చేయడం లేదు.. నిర్మాత నాగవంశీ

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మమ్మల్ని త్రివిక్రమ్ గారే నిలబెట్టారు. త్రివిక్రమ్ గారి సినిమాలు కాకుండా వేరే సినిమాలు నిర్మించడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ స్థాపించాము. త్రివిక్రమ్ గారు కొత్తవాళ్లకు, ట్యాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ స్థాపించారు. సాయి సౌజన్య గారు ప్రొడక్షన్ లోకి రారు. కథ ఓకే చేసేముందు మా క్రియేటివ్ స్పేస్ లో కూర్చుంటారు. కథ వింటారు, సజెషన్స్ ఏమన్నా ఉన్నా, ఛేంజెస్ ఏమన్నా అనిపించినా క్రియేటివ్ స్పేస్ తో డిస్కస్ చేస్తారు అని తెలిపారు. దీంతో త్రివిక్రమ్ నిర్మాతగా తన భార్యపేరు వేసినా ఆమె కథ, స్క్రిప్ట్ వరకే చూస్తారని, ప్రొడక్షన్ పనులు చూడరని తెలుస్తుంది.