Tunnel Review
Tunnel Review : అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన సినిమా టన్నెల్. రవీంద్ర మాధవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్లో ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమాని లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేశారు.(Tunnel Review)
కథ విషయానికొస్తే.. ఓ బ్యాంకు దొంగతనం కేసులో ఒక గ్యాంగ్‌ని పోలీసు ఆఫీసర్స్ ఎన్ కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న ఆఫీసర్స్‌ని ఓ గ్యాంగ్ (అశ్వత్ కాకుమాను అతని గ్యాంగ్) చంపేస్తూ ఉంటుంది. అంతే కాకుండా పోలీస్ యూనిఫాం వేసుకున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టమని ఆ గ్యాంగ్ శపథం చేస్తుంది.
మరో వైపు ఖాళీగా తిరుగుతూ ఏమి పట్టించుకొని అఖిల్(అథర్వా మురళీ) అనుతో (లావణ్య త్రిపాఠి) ప్రేమలో పడతాడు. UPSC పాస్ అయిన అనుకి, గాలికి తిరిగే వ్యక్తిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలని అను ఫాదర్ అడ్డుపడటంతో అఖిల్, తన ఫ్రెండ్స్ ట్రై చేయగా అందరికి ఒకే స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా పోస్టింగ్ వస్తుంది. వీళ్ళ జాయినింగ్ రోజే ఓ పెద్ద సమస్య వస్తుంది. దీంతో అఖిల్, కొంతమంది పోలీసులు పోలీసులను చంపే గ్యాంగ్ వేసిన వలలో చిక్కుకుంటారు. దీంతో ఓ స్లమ్ ఏరియాలో ఇరుక్కుంటారు. మరి ఆ స్లమ్ ఏరియా నుంచి హీరో, పోలీసులు తప్పుకున్నారా? అసలు విలన్ ఎందుకు పోలీసులను చంపుతున్నాడు? హీరోకి, అతని ఫ్రెండ్స్ కి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎలా వచ్చాయి? కథలో టన్నెల్ పాత్రేంటి? విలన్ ప్లాన్ ఏంటి? హీరో తన ఫ్రెండ్స్ ని కాపాడుకుంటాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Beauty Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్..
టన్నెల్ కథ బ్యాంక్ దొంగతనం చేసిన గ్యాంగ్, వాళ్ళను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు, ఆ పోలీసుల్ని చంపే గ్యాంగ్ అంటూ ఆసక్తిగా మొదలవుతుంది. తర్వాత హీరో పాత్ర, అతని లవ్ స్టోరీ కాస్త రొటీన్ గానే సాగుతుంది. హీరో, అతని ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాక అసలు కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొల్పారు.
ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో స్లమ్ ఏరియాలో ఇరుక్కొని విలన్ నుంచి ఎలా బయటకు వచ్చాడు? విలన్ కథేంటి అనే సాగుతుంది. స్లమ్ ఏరియా పోలీస్ – విలన్ సీన్స్ అన్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తాయి. విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. ఇక క్లైమాక్స్ మాత్రం యాక్షన్ థ్రిల్లర్ లా మెప్పిస్తుంది. ఇటీవల లావణ్య త్రిపాఠి తల్లి అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లావణ్య ఎప్పుడో చేసినా తాజాగా రిలీజయింది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అథర్వా మురళీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో అదరగొడతాడని తెలిసిందే. మరోసారి అదే పంథాలో తనకు బాగా కలిసొచ్చిన జానర్లో మెప్పించాడు. అశ్వత్ కాకుమాను నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు. లావణ్య త్రిపాఠి పాత్రకు అంత స్కోప్ లేదు. కేవలం హీరోయిన్ వచ్చి వెళ్ళింది అన్నమాటే. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. ఈ సినిమాలో చాలా వరకు రాత్రి పూటే కథ జరుగుతుంది. దానికి తగట్టు విజువల్స్ బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్లమ్ ఏరియా సెట్ బాగా వేశారు. కథ పాతదే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్ సబ్జెక్టుగా బాగానే తెరకెక్కించారు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘టన్నెల్’ సినిమా ఒక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.