భర్త నుండి విడాకులు పొందిన నటి సిమ్రాన్.. కొడుకు కస్టడీ మాత్రం తనకే..

పాపులర్ బాలీవుడ్ టీవీ నటి సిమ్రాన్ ఖన్నా తన భర్త నుండి విడాకులు తీసుకున్నారు..

  • Published By: sekhar ,Published On : April 13, 2020 / 03:17 PM IST
భర్త నుండి విడాకులు పొందిన నటి సిమ్రాన్.. కొడుకు కస్టడీ మాత్రం తనకే..

Updated On : April 13, 2020 / 3:17 PM IST

పాపులర్ బాలీవుడ్ టీవీ నటి సిమ్రాన్ ఖన్నా తన భర్త నుండి విడాకులు తీసుకున్నారు..

బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్స్, బయోపిక్స్‌తో పాటు నటీనటుల డైవోర్స్ పరంపర కూడా కంటిన్యూ అవుతోంది. తాజాగా సీరియల్ నటి సిమ్రాన్ ఖన్నా అధికారికంగా తన భర్త నుండి విడాకులు పొందిన వార్త హిందీ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. స్టార్‌ప్ల‌స్ ఛానెల్‌లో సూప‌ర్‌హిట్ అయిన ‘Yeh Rishta Kya Kehlata Hai’ (యే రిష్తా క్యా కెహ్లాతా హై) సీరియ‌ల్‌లో గాయ‌త్రి గోయెంకా పాత్ర పోషించిన న‌టి సిమ్రాన్ ఖ‌న్నా భ‌ర్త  భ‌ర‌త్ నుంచి విడాకులు తీసుకుంది.

TV actress Simran Khanna

ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెలువడించింది. తామిద్దరం స్నేహ‌పూర్వ‌కంగానే విడిపోతున్నామ‌ని, ఇద్ద‌రి మ‌ధ్యా ఎలాంటి శ‌త్రుత్వం లేద‌ని చెప్పింది. కాగా కుమారుడు వినీత్ ఖన్నా క‌స్ట‌డీ మాత్రం భ‌ర్త‌కే ఇచ్చిన‌ట్లు తెలిపిన సిమ్రాన్‌..త‌రుచుగా కొడుకుని మాత్రం క‌లుస్తానని చెప్పింది. 

Read Also : శింబు, ప్రభు.. ఇప్పుడు ఇతను.. టోకెన్ నెంబర్ త్రీ అన్నారు.. తన లవ్ ఫెయిల్యూర్స్‌పై నయన్..

​​TV actress Simran Khanna
‘‘అవును, నేను భ‌ర‌త్ విడాకులు తీసుకున్నాం. అంత‌మాత్రాన మా మ‌ధ్య ద్వేషం, శ‌త్రుత్వం లేదు. ఇద్ద‌రి అభిప్రాయంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. మా ఇద్ద‌రి మార్గాలు వేరు. అలానే విడిపోయాం. నా కొడుకు క‌స్ట‌డీ మాత్రం భ‌ర‌త్‌కే అప్ప‌జెప్పాను’’ అని చెప్పుకొచ్చింది. పలు టీవీ సీరియల్స్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది సిమ్రాన్ ఖన్నా.