Mahesh Babu: ఒకే ఏడాదిలో మహేష్ ఇంట రెండు విషాదాలు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇవాళ ఉదయం మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. అయితే ఈ ఏడాదిలో మహేష్ బాబు ఇంట్లో రెండు విషాదాలు చోటు చేసుకోవడం అభిమానులను కలిచివేస్తుంది.

Two Tragedies In One Year In Mahesh Babu Family
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇవాళ ఉదయం మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే ఆమె తమ నివాసంలో తుదిశ్వాసను విడవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర దు:ఖంలోకి వెళ్లింది. ఇక మహేష్ బాబుకు తన తల్లి అంటే ఎనలేని ప్రేమ. ఆయన తన తల్లిపై ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు.
Indira Devi: మహేశ్ బాబుకు మాతృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి
అయితే ఈ ఏడాదిలో మహేష్ బాబు ఇంట్లో రెండు విషాదాలు చోటు చేసుకోవడం అభిమానులను కలిచివేస్తుంది. ఈ ఏడాది జనవరి నెలలో మహేష్ సోదరుడు, నటుడు కమ్ నిర్మాత రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో, ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుండి మహేష్ అండ్ ఫ్యామిలీ బయటకు వస్తున్నారు. కానీ, ఇంతలోనే మహేష్‌కు ఎంతో ఇష్టమైన తన తల్లి మృతిచెందడంతో ఆయన మళ్లీ తీవ్ర దు:ఖంలోకి వెళ్లిపోయారు.
Ramesh Babu: మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్!
ఇలా ఒకే ఏడాదిలో మహేష్ బాబు ఇంట రెండు విషాదాలు చోటు చేసుకోవడంతో ఆయన అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సమయంలో మహేష్ బాబుకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరుతున్నారు.