Udayanidhi Stalin : ఇకపై సినిమాలు చేయను.. స్టార్ నటుడు సంచలన నిర్ణయం..
ఉదయనిధి స్టాలిన్ ఇటీవల నటించిన మామన్నన్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Udayanidhi Stalin said goodbye to movies Fans disappointed
Udayanidhi Stalin : తమిళనాడు(Tamilanadu) ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా పలు సినిమాలు చేసి మెప్పించారు. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో పోటీచేసి MLA గా కూడా గెలుపొందారు. MLA అయిన తర్వాత కూడా పలు సినిమాలు చేశారు. అయితే ఇటీవల ఉదయనిధి స్టాలిన్ యూత్ వెల్ఫేర్, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత మాత్రం సినిమాలేమి ఒప్పుకోలేదు.
ఉదయనిధి స్టాలిన్ ఇటీవల నటించిన మామన్నన్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం ప్రకటించారు.
Prashanth Neel : సలార్ సెట్‌లో ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడండి..
ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ఇకపై సినిమాలు చేయను. మామన్నన్ లాంటి మంచి సినిమా నా చివరి సినిమా కావడం సంతోషంగా ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో నేను ఓ సినిమా చేయాలి. కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమాల్లో నటించడం సరికాదని నా అభిప్రాయం. అందుకే సినిమాలు ఆపేస్తున్నాను. ఒకవేళ మామన్నన్ దర్శకుడు మారి సెల్వరాజ్ కనుక మంచి కథతో మళ్ళీ వస్తే మూడేళ్ళ తర్వాత నటించడానికి ఆలోచిస్తాను అని అన్నారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.