Naatu Naatu : ‘నాటు నాటు’తో యుక్రెయిన్ నిరసన.. సైనికుల రీ క్రియేట్ వీడియో వైరల్!

నాటు నాటు సాంగ్ ని రీ క్రియేట్ చేస్తూ యుక్రెయిన్ మిలిటరీ అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

RRR Naatu Naatu : ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) సృష్టించిన నాటు నాటు ప్రభంజనం ఇప్పటిలో ఇంకా తగ్గేలా లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రం కోసం ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు సాంగ్ కి చంద్రబోస్ క్యాచీ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఊర మాస్ కోరియోగ్రఫీ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. దీంతో ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ (Oscar) ని కూడా అందుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఈ సాంగ్ కి సాధారణ ప్రజలు నుంచి సెలబ్రేటిస్, అధికారులు కూడా స్టెప్ వెయ్యకుండా ఉండలేకపోతున్నారు.

Nikhil Siddhartha : ఆ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో నిఖిల్.. సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా దాకా..

ఇప్పటికే కొరియన్, జపాన్, జర్మన్ వంటి దేశ అధికారులు సైతం నాటు నాటు అంటూ స్టెప్ వేసి ఎంజాయ్ చేశారు. తాజాగా ఈ సాంగ్ ని యుక్రెయిన్ (Ukraine) సైనికులు నిరసన తెలపడానికి ఉపయోగించుకున్నారు. నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సాంగ్ ని యుక్రెయిన్, రష్యా (Russia) అధికారులకు వ్యతిరేకంగా ఈ సాంగ్ ని రీ క్రియేట్ చేశారు. సాంగ్ మ్యూజిక్ ని తీసుకోని లిరిక్స్ మార్చి పేరడీ చేసి యుక్రెయిన్ మిలిటరీ అధికారులు డాన్స్ చేశారు. కాగా యుక్రెయిన్, రష్యా కొంతకాలంగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

SSMB28 First Look: ఊర మాస్ లుక్‌లో మ‌హేశ్ బాబు.. గ‌ళ్ల చొక్కా, త‌ల‌కు రిబ్బ‌న్‌..ఇంకా

ఇక సాంగ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది. యుక్రెయిన్ మిలిటరీ సాంగ్ ని చాలా బాగా రీ క్రియేట్ చేశారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ RRR రిలీజ్ అయ్యి ఏడాది పైనే అయ్యిపోయింది. ఇంకా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం నుంచి ఆడియన్స్ బయటకు రాలేకపోతున్నారు. ఇక జపాన్ లో కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. అక్కడ ఇటీవలే 200 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు