Nikhil Siddhartha : ఆ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో నిఖిల్.. సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా దాకా..

హ్యాపీడేస్ సినిమాలో ఓ సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేసినా ఒక దశలో వరుస ఫ్లాప్స్ చూశాడు. స్వామిరారా నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హిట్స్ వచ్చినా రాకపోయినా కొత్త కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాడు.

Nikhil Siddhartha : ఆ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో నిఖిల్.. సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా దాకా..

Nikhil Siddhartha most wanted pan India hero for suspense and thrilling movies

Nikhil Siddhartha :  నిన్నటి వరకూ తెలుగు ఆడియన్స్ కి తప్ప మిగతా వాళ్లకి పెద్దగా తెలీని నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు. రొటీన్ సినిమాలు చేస్తే ఇలాగే ఉంటామని సమ్ థింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో కెరీర్ లో దూకుడు పెంచాడు. మొన్నటి వరకూ చిన్న హీరో అయిన నిఖిల్ ఇప్పుడు పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ తో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

హ్యాపీడేస్ సినిమాలో ఓ సైడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేసినా ఒక దశలో వరుస ఫ్లాప్స్ చూశాడు. స్వామిరారా నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హిట్స్ వచ్చినా రాకపోయినా కొత్త కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో నిఖిల్ చేసిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోయినా మంచి పేరు తెచ్చాయి. ఇటీవల కార్తికేయ 2 సినిమా దేశవ్యాప్తంగా భారీ హిట్ సాధించడంతో నిఖిల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.

కార్తికేయ, 18 పేజెస్ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు నిఖిల్. త్వరలో స్పై అనే భారీ పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక నిఖిల్ కెరీర్ లో కార్తికేయ2 తో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన అభిషేక్ అగర్వాల్ బ్యానర్ తో పాటు కొత్త బ్యానర్ అనౌన్స్ చేసిన రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ బ్యానర్ లో తాజాగా నిఖిల్ హీరోగా మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు.

స్వతంత్రం ముందు జరిగిన కథతో ‘ద ఇండియా హౌజ్’ అనే ఇంట్రస్టింగ్ సినిమా అనౌన్స్ చేశారు. రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 100కోట్లకు పైగానే అని తెలుస్తోంది. చరిత్ర మర్చిపోయిన విషయం అంటూ సినిమాను అనౌన్స్ చేశారు. ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి 25 వేలు లంచం ఇచ్చాను అని చెప్పిన నిఖిల్ ఇప్పుడు 100 కోట్ల పాన్ ఇండియా సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఎంతో సహనంతో, ఎంతో కష్టంతో కూడుకున్న సక్సెస్ ఇది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సస్పెన్స్ థ్రిల్లర్స్, ఆసక్తికర కథలను తీయాలంటే తెలుగులో నిఖిల్ కరెక్ట్ అని అంతా నమ్ముతున్నారు.

Ram Charan : వీర్ సావర్కర్ జయంతి.. నిఖిల్‌తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన రామ్ చరణ్.. టైటిల్ ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాను కాకుండా ఇంకో హీరోని పెట్టి నిర్మాతగా సినిమా తీస్తున్నాడంటే నిఖిల్ ఏ రేంజ్ సక్సెస్ సాధించాడో అర్థమైపోతుంది. అందుకే ఇప్పుడు నిఖిల్ మోస్ట్ వాంటెడ్ హీరో అంటున్నారు. మరి ఈ రేంజ్ గుర్తింపు ని నిఖిల్ జాగ్రత్తగా వాడుకొని, మంచి సబ్జెక్ట్స్ ఎంచుకొని మరిన్ని హిట్స్ కొట్టాలని అంతా ఆశిస్తున్నారు.