ఇది నిజమేనా: ‘అర్జున్ రెడ్డి’ నటితో విశాల్ పెళ్లి!
తమిళ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విశాల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో వదంతులు చక్కెర్లు కొట్టాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను విశాల్ పెళ్లాడబోతున్నాడని ఇటీవల వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.

తమిళ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విశాల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో వదంతులు చక్కెర్లు కొట్టాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను విశాల్ పెళ్లాడబోతున్నాడని ఇటీవల వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.
తమిళ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విశాల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో వదంతులు చక్కెర్లు కొట్టాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను విశాల్ పెళ్లాడబోతున్నాడని ఇటీవల వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. తన పెళ్లిపై విశాల్ కూడా పబ్లిక్ గా స్పందించలేదు. కానీ, ఈ వదంతులకు చెక్ పెడుతూ.. విశాల్ ను చేసుకోబోయే అమ్మాయే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఈయనే అంటూ విశాల్ తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేసింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయే. ఇంకా గుర్తు పట్టలేదా? విజయ దేవరకొండ, శాలినీ పాండే జంటగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో కూడా నటించింది. ఆమె.. అనిషా రెడ్డి. పెళ్లిచూపులు చిత్రంలో కూడా విజయదేవరకొండకు జోడీగా అనీషా నటించింది. హైదరాబాద్ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అనీషాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు.
అందుకే తన జీవితంలో సెటిల్ కావాలనే ఉద్దేశంతో విశాల్ తో పెళ్లికి సిద్ధమైంది. తన కొత్త జీవితాన్ని విశాల్ తో నే ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. ‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా జీవితం ఆరంభించాడానికి ఓ తోడు దొరికింది. విశాల్ కు తోడుగా ఉండి ప్రేమను పంచుతూ ఆయన మనస్సుకు నచ్చినట్టుగా నడుచుకుంటాను’’ అని పోస్టు పెట్టింది అనిషా.
ఇటీవల విశాల్ తండ్రి జీకే రెడ్డి కూడా అతడి పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాదిలో విశాల్, అనిషా రెడ్డి పెళ్లి జరుగబోతుందని చెప్పారు. గతంలో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, విశాల్ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే.