120 Film Crew Members Hospitalised: స్టార్ హీరో సినిమా షూటింగ్‌లో కలకలం.. 120 మంది సిబ్బంది ఆసుపత్రి పాలు.. కారణం ఏంటంటే..

ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి పరిస్థితి స్థిరంగా ఉంది. చికిత్స పొందిన తర్వాత వారిలో ఎక్కువ మంది డిశ్చార్జ్ అయ్యారు.

120 Film Crew Members Hospitalised: నటుడు రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతోంది. అక్కడ సినిమా సెట్స్‌లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది.

ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చెందిన దాదాపు 120 మంది సిబ్బంది ఫుడ్ పాయిజనింగ్ కారణంగా లేహ్‌లో ఆసుపత్రి పాలయ్యారు.

లేహ్‌లో 100 మందికి పైగా సిబ్బంది ఆసుపత్రి పాలు..

“ఆదివారం సాయంత్రం బాలీవుడ్ చిత్ర బృందంలోని 100 మందికి పైగా కార్మికులు లేహ్‌లో ఫుడ్ పాయిజనింగ్ కేసుతో ఆసుపత్రి పాలయ్యారు. ఆహారం తిన్న తర్వాత సిబ్బందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది.

ఆ తర్వాత, వారిని వెంటనే చికిత్స కోసం లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. ఇది మాస్ ఫుడ్ పాయిజనింగ్ అని డాక్టర్ నిర్ధారించారు.

దాదాపు 600 మంది ఆ ప్రదేశంలో ఒకే ఆహారాన్ని తిన్నారు. కారణాన్ని గుర్తించడానికి వివరణాత్మక విశ్లేషణ కోసం ఆహార నమూనాలను సేకరించారు” అని అధికారులు తెలిపారు.

ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి పరిస్థితి స్థిరంగా ఉంది. చికిత్స పొందిన తర్వాత వారిలో ఎక్కువ మంది డిశ్చార్జ్ అయ్యారు.

ధురంధర్ సినిమాలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రణవీర్ సింగ్ పుట్టినరోజున ధురంధర్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5 2025న విడుదల కానుంది.

Also Read: సత్యదేవ్ ‘రావ్ బహదూర్’ టీజర్ రిలీజ్.. ఇదేదో కొత్తగా ఉందే.. మహేష్ బాబు మంచి కాన్సెప్ట్ పట్టాడుగా..