Maa Vande
Maa Vande : మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నరేంద్రమోదీ బయోపిక్ ‘మా వందే’ అనే పేరుతో తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వీర్ రెడ్డి.ఎం. నిర్మాణంలో క్రాంతికుమార్.సి.హెచ్. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Maa Vande)
ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితంలోని యదార్థ ఘటనల ఆధారంగా ఈ మా వందే సినిమా తెరకెక్కుతుంది. మా వందే సినిమా పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని ఏకంగా 400 కోట్ల రూపాయల హ్యూజ్ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట.
Also See : Naresh Pavitra : కొత్త సినిమా ఈవెంట్లో సందడి చేసిన నరేష్ – పవిత్ర జంట.. ఫోటోలు వైరల్..
ఈ సినిమాని తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్ తో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్ లో హీరోగా నటించిన జేసన్ మమొవాను మా వందే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట. అలాగే ఈ సినిమాలో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండు షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కాశ్మీర్ లో ప్రారంభం కానుంది.
దేశ ప్రజల మనుసు గెలుచుకున్న ప్రధాని మోదీ జీవిత చరిత్రని ఆయనకు తల్లితో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్తూ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బీజీపీ కార్యకర్తలు, ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Naresh : నాతో మంచి లైఫ్ గడపాలి మీరు.. పవిత్ర మాటలకు నరేష్ ఎమోషనల్..