Unstoppable episode 4 : పాత మిత్రులు కలిసినప్పుడు.. వారి మధ్య మాటలు ‘అన్‌స్టాపబుల్’..

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అద్భుతమైన ప్రేక్షాధారణ పోతుంది. ఇక నాలుగో ఎపిసోడ్ కోసం మళ్ళీ రాజకీయ నాయకులను తీసుకు వస్తున్నారు నిర్వాహుకులు. ఈ ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రస్తుత తెలంగాణా రాజ్యసభ మెంబర్...

Unstoppable episode 4 : పాత మిత్రులు కలిసినప్పుడు.. వారి మధ్య మాటలు ‘అన్‌స్టాపబుల్’..

Unstoppable episode 4 guests are Kiran Kumar Reddy and K R Suresh Reddy

Updated On : November 17, 2022 / 11:07 AM IST

Unstoppable episode 4 : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అద్భుతమైన ప్రేక్షాధారణ పోతుంది. నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో మొదటి సీజన్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో షో నిర్వాహకులు సెకండ్ సీజన్ ని అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్లాన్ చేసి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

CM Jagan Balakrishna Wishes : పరస్పరం పలకరించుకున్న సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ

ఇక రెండో, మూడు ఎపిసోడ్స్ లో టాలీవుడ్ యువ హీరోల సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌, విశ్వక్ సేన్, అడివి శేషు, శర్వానంద్ తో కలిసి సందడి చేశాడు బాలయ్య. ఇక నాలుగో ఎపిసోడ్ కోసం మళ్ళీ రాజకీయ నాయకులను తీసుకు వస్తున్నారు నిర్వాహుకులు. కాగా నాలుగో ఎపిసోడ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధులుగా వస్తున్నారని తొలుత వార్తలు వినిపించాయి.

అయితే ఈ ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రస్తుత తెలంగాణా రాజ్యసభ మెంబర్ ‘కే ఆర్ సురేష్ రెడ్డి’ హాజరుకానున్నాడు. సురేష్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 2004 – 2009 మధ్య స్పీకర్ గా పనిచేశారు. ఈ విషయాన్ని ఆహా సోషల్ మీడియా అకౌంట్ లో తెలియజేస్తూ.. ‘పాత మిత్రులు కలిసినప్పుడు, వారి మధ్య మాటలు అన్‌స్టాపబుల్’ అంటూ కాప్షన్ ఇచ్చారు. నవంబర్ 18న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)