Unstoppable episode 4 : అన్‌స్టాపబుల్ నాలుగో ఎపిసోడ్ గెస్టులుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి మరియు శాసనసభ స్పీకర్..
ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా వేదికగా నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి రాబోయే అతిధులు గురించిన వార్త బయటకి వచ్చింది. ఈ టాక్ షో యొక్క నాల్గవ ఎపిసోడ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్..

Unstoppable episode 4 guests are last Chief Minister and Speaker of the Legislative Assembly of the united Andhra Pradesh
Unstoppable episode 4 : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా వేదికగా నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. మొదటి సీజన్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో షో నిర్వాహకులు సెకండ్ సీజన్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ని ముఖ్య అతిథులుగా తీసుకు వచ్చాడు బాలయ్య.
ఇక రెండవ ఎపిసోడ్ లో యువహీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ – మూడో ఎపిసోడ్ లో అడివి శేష్, శర్వానంద్ హాజరయ్యి బాలయ్యతో కలిసి సందడి చేశారు. తమ అభిమాన వ్యక్తుల జీవితాలు మరియు వారి జీవితంలో ఉన్న చీకటి కోణాన్ని బాలయ్య సరికొత్త రీతిలో అవిష్కిరిస్తుంటే.. అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి రాబోయే అతిధులు గురించిన వార్త బయటకి వచ్చింది.
ఈ టాక్ షో యొక్క నాల్గవ ఎపిసోడ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఎపిసోడ్ షూటింగ్ నవంబర్ 14న జరిగే అవకాశం ఉంది. షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.