Unstoppable : బట్టలిప్పుతూ డ్యాన్స్ చేసిన శర్వానంద్, అడివి శేష్.. జత కలిసిన బాలయ్య.. రచ్చ రచ్చ చేశారుగా..

ఎపిసోడ్ లో భాగంగా ఓ సరదా గేమ్ ఆడదామన్నారు బాలయ్య. స్క్రీన్ మీద కనిపించిన వార్త నిజమైతే, అది ఎవరికీ సంబంధించినది అయితే వాళ్ళు బట్టలిప్పేయాలి అని అన్నారు. దీంతో ఇద్దరు యువ హీరోలు షాక్ అయ్యారు...............

Unstoppable : బట్టలిప్పుతూ డ్యాన్స్ చేసిన శర్వానంద్, అడివి శేష్.. జత కలిసిన బాలయ్య.. రచ్చ రచ్చ చేశారుగా..

Balayya Dance with Adivi Sesh and Sharwanand in Unstoppable Show

Unstoppable :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. ఎపిసోడ్ లో భాగంగా ఓ సరదా గేమ్ ఆడదామన్నారు బాలయ్య. స్క్రీన్ మీద కనిపించిన వార్త నిజమైతే, అది ఎవరికి సంబంధించినది అయితే వాళ్ళు బట్టలిప్పేయాలి అని అన్నారు. దీంతో ఇద్దరు యువ హీరోలు షాక్ అయ్యారు. వాళ్ళిద్దర్నీ ఒప్పించాడు బాలయ్య. దీంతో స్క్రీన్ మీద వచ్చిన వార్తలు ఒకసారి శర్వాకి, మరోసారి అడివి శేష్ కి ఇలా మారుతూ వచ్చాయి.

Balakrishna : అన్‌స్టాపబుల్.. ఇక్కడ పెళ్లిళ్లు చేయబడును..

మొదట శర్వా వాచ్ తీయగా బట్టలు తీయమంటే వాచ్ తీస్తావేంటి అని బాలయ్య సరదాగా ఫైర్ అయ్యారు. ఆ తర్వాతా ఫోన్, కార్డ్స్ తీయగా శర్వా దగ్గర్నుంచి బాలయ్య అవి లాగేసుకున్నారు. శేష్ కూడా మొదట వాచ్ తీసాడు. ఆ తర్వాత పాట వేయగా శర్వానంద్, అడివి శేష్ ఇద్దరూ డ్యాన్స్ వేస్తూ ఒకరి తర్వాత ఒకరు తమ సూట్స్ లని తీసేసారు. లాస్ట్ లో బాలకృష్ణ పైసా వసూల్ పాటకి బాలయ్య కూడా తన సూట్ తీసేస్తూ డ్యాన్స్ వేశారు. మొత్తానికి షోలో అడివి శేష్, శర్వానంద్ తో కలిసి స్టెప్పులేస్తూ బాలయ్య రచ్చ రచ్చ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ఫుల్ గా వైరల్ అవుతుంది.