Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్‌లో ప్ర‌భాస్‌కి కాల్ చేసిన చ‌ర‌ణ్.. రెబ‌ల్ స్టార్ రివేంజ్..?

నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

Unstoppable With NBK Ramcharan call to Prabhas

నందమూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ స్ట్రీమింగ్ అవుతోంది. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అన్‌స్టాప‌బుల్ షోకు అతిథిగా వ‌చ్చారు. ఆయ‌న‌తో పాటు యంగ్ హీరో శ‌ర్వానంద్‌, యువ నిర్మాత విక్ర‌మ్ రెడ్డి సైతం వ‌చ్చారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో పూరైంది.

ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. ఈ ఎపిసోడ్‌లో చ‌ర‌ణ్ త‌న మిత్రుడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఫోన్ చేశాడ‌ట‌. గ‌తంలో ప్ర‌భాస్ అన్‌స్టాప‌బుల్ షోకి రాగా అప్పుడు ఆయ‌న చ‌ర‌ణ్‌కి ఫోన్ చేశాడు.

Vidaamuyarchi – Game Changer : సినిమాలు లేని సంక్రాంతి.. ఆ సినిమా వాయిదాతో చ‌ర‌ణ్‌కు క‌లిసి వ‌స్తుందా?

ప్ర‌భాస్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉంద‌ని చ‌ర‌ణ్ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. నువ్వు కూడా అన్‌స్టాప‌బుల్ కి వ‌స్తావుగా అప్పుడు నాకే కాల్ చేయాలి.. అప్పుడు చెబుతా అంటూ ప్ర‌భాస్ ఫ‌న్నీగా అన్నాడు.

ఇప్పుడు త‌న‌కు అవ‌కాశం రావ‌డంతో ప్ర‌భాస్ సైతం చ‌ర‌ణ్‌ని ఆట‌ప‌ట్టించాడ‌ని అంటున్నారు. ఇది ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిల‌వ‌నుంద‌ని టాక్‌. ప్ర‌భాస్ కాల్‌లో ఏమ‌న్నాడో తెలుసుకోవాల‌ని ఇటు ప్ర‌భాస్‌, అటు రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 10న గేమ్ ఛేంజ‌ర్‌ రిలీజ్ రోజే రిలీజ్ చేస్తారని, పండగ ఎపిసోడ్ లా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నేడు రాబోయే అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ చివర్లో ఈ కాల్ ప్రోమోని చూపించనున్నట్టు తెలిపారు.

Game Changer Trailer : రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..