Rajinikanth : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి జైలర్ చూడనున్న రజినీకాంత్..

సూపర్ స్టార్ జైలర్ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో సెలబ్రిటీల్లో ఆయన అభిమానులు అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు జైలర్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏకంగా సీఎంలు కూడా థియేటర్స్ కి వెళ్లి మరీ జైలర్ చూస్తున్నారు.

UP CM Yogi Adityanath will watch jailer Movie with Rajinikanth

Rajinikanth Jailer :  సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’(Jailer) సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లో ఉంది.

సూపర్ స్టార్ జైలర్ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో సెలబ్రిటీల్లో ఆయన అభిమానులు అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు జైలర్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏకంగా సీఎంలు కూడా థియేటర్స్ కి వెళ్లి మరీ జైలర్ చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ జైలర్ సినిమాని థియేటర్లో వీక్షించగా ఇపుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రజినీకాంత్ తో కలిసి జైలర్ సినిమా చూడబోతున్నారు.

Brahmanandam Son Marriage : ఘనంగా బ్రహ్మానందం రెండో తనయుడు సిద్ధార్థ్ వివాహం.. హాజరైన సినీ, రాజకీయ సెలబ్రిటీలు..

జైలర్ హిట్ అయ్యాక రజినీకాంత్ ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఇటీవల బద్రీనాథ్ కి వెళ్లిన రజినీకాంత్, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాలని కూడా సందర్శిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో నిన్న రాత్రి లక్నో వెళ్లారు. నేడు లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిసి ఆయనతో జైలర్ సినిమా చూడబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు తెలియచేశారు. అయితే బీజేపీ సీఎంని రజినీకాంత్ కలుస్తుండటంతో రాజకీయాల్లో కూడా ఈ భేటీపై చర్చలు జరుగుతున్నాయి.