Pratysha Garimella : తన మరణం నన్ను బాధిస్తుంది.. ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

ట్వీట్ లో.. ''మై బెస్టీ, మై డియరెస్ట్‌ ఫ్రెండ్‌. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ది బెస్ట్‌గా ఉండేది. కెరీర్‌, ఫ్యామిలీ, స్నేహితులు....................

Pratysha Garimella : తన మరణం నన్ను బాధిస్తుంది.. ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

Pratysha

Updated On : June 12, 2022 / 12:38 PM IST

Upasana :  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలకు వర్క్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ శనివారం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సొంతంగా బొటిక్ స్థాపించి, ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ఎదిగింది ప్రత్యూష.

ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలియచేస్తున్నారు. తాజాగా ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన సంతాపం తెలుపుతూ ఆమెతో తనకున్న బంధాన్ని తెలియచేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

Nayan-Vignesh : నయన్ పెళ్ళికి షారుఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఈ ట్వీట్ లో.. ”మై బెస్టీ, మై డియరెస్ట్‌ ఫ్రెండ్‌. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ది బెస్ట్‌గా ఉండేది. కెరీర్‌, ఫ్యామిలీ, స్నేహితులు.. అన్ని విషయాల్లోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం పయనిస్తుందనేది నిజం అనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ఉపాసన పోస్ట్ చేశారు.