Klin Kaara : టీవీలో నాన్న చరణ్ ని చూసి క్లిన్ కారా ఎంత ఎగ్జైట్ అవుతుందో.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన..

తాజాగా ఉపాసన క్లిన్ కారా క్యూట్ వీడియో ఒకటి షేర్ చేసింది.

Upasana Shares Klin Kaara Cute Video She Exciting after Watching Ram Charan on TV Video goes Viral

Klin Kaara : రామ్ చరణ్ – ఉపాసన గారాలపట్టి, మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లిన్ కారా పుట్టినప్పటి నుంచి వైరల్ అవుతూనే ఉంది. తన పేరు, ఫేస్ కనిపించకుండానే తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఉపాసన కూడా అప్పుడప్పుడు క్లిన్ కారాతో దిగిన ఫోటోలు ఫేస్ చూపించకుండానే పోస్ట్ చేస్తుంది. తాజాగా ఉపాసన క్లిన్ కారా క్యూట్ వీడియో ఒకటి షేర్ చేసింది.

Also Read : Devara 100 Days : ‘దేవర’ 100 డేస్ స్పెషల్ పోస్టర్.. ఎన్ని సెంటర్స్ లో ఆడుతుందో తెలుసా?

ఈ వీడియోలో RRR బియాండ్ అండ్ బిహైండ్ డాక్యుమెంటరీని ఇంట్లో చూస్తుండగా అందులో చరణ్ ని చూసి క్లిన్ కారా ఎగ్జైట్ అవుతుంది. మాటలు ఇంకా రాలేదు కాబట్టి నాన్నని చూసి సౌండ్స్ చేస్తుంది. ఈ క్యూట్ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. క్లిన్ కారా మొదటిసారి వాళ్ళ నాన్నని టీవీలో చూసి ఎగ్జైట్ అవుతుంది. రామ్ చరణ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను. గేమ్ ఛేంజర్ కోసం ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసింది.

దీంతో ఉపాసన షేర్ చేసిన క్లిన్ కారా వీడియో వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ మరింత షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

 

ఇప్పటిదాకా కూడా క్లిన్ కారా ఫేస్ కనపడకుండానే జాగ్రత్త పడుతున్నారు మెగా ఫ్యామిలీ. క్లిన్ కారా ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినా ఒక్కసారి కూడా ఫేస్ రివీల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఫేస్ రివీల్ చేయకుండానే క్లిన్ కారా ఎగ్జైట్ అవుతున్న వీడియో చూపించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఇంకెప్పుడు మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారు అని అడుగుతున్నారు. 2023 జూన్ 20న క్లిన్ కారా పుట్టింది. గత సంవత్సరం జూన్ లో మొదటి బర్త్ డేని కూడా సింపుల్ గా ఇంట్లోనే చేశారు. మరి ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ని ఫ్యాన్స్ కు ఎప్పుడు చూపిస్తారో..

Also Read : Ram Charan – Naharika : అన్నతో పోటీగా చెల్లి.. చరణ్ గేమ్ ఛేంజర్ కి పోటీగా నిహారిక సినిమా సంక్రాంతి బరిలో..