Upasana
Upasana : రామ్ చరణ్ – ఉపాసన కూతురు క్లిన్ కారా ఫేస్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో చూపించకపోయినా ఫ్యాన్స్ క్లిన్ కారాని వైరల్ చేస్తూ ఉంటారు. త్వరగా క్లిన్ కారాని చూపించమని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉపాసన అప్పుడప్పుడు క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా పలు ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. చరణ్, ఉపాసన ఇద్దరూ ఇంటర్వ్యూలలో క్లిన్ కారా గురించి కబుర్లు చెప్తారు. క్లిన్ కారా ఫోటో ఏదొచ్చినా మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తారు.
తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లిన్ కారా గురించి ఆసక్తికర విషయం తెలిపింది. ఈ ఇంటర్వ్యూ ఫుడ్ కి సంబంధించింది. ఉపాసన, హోస్ట్ కలిసి ఇంటర్వ్యూలో లంచ్ కూడా చేసారు. మెగా ఫ్యామిలీ ఫుడ్ గురించి బోల్డన్ని విషయాలు మాట్లాడారు.
Also Read : NTR Fan : నా మొదటి అభిమాని ఇతనే.. నేను హీరో అవ్వకముందే.. స్టేజిపై వీరాభిమానిని పరిచయం చేసిన ఎన్టీఆర్..
ఈ క్రమంలో ఉపాసన మాట్లాడుతూ.. నా ఫేవరేట్ ఫుడ్ రాగి సంగటి, మటన్ పులుసు. నా కూతురికి రోజూ రాగి పెడతాను. సద్గురు చెప్పారు నా కూతురికి రాగి ఫుడ్ ఏ రూపంలో అయినా రోజూ తినిపించు అని. క్లిన్ కారా డైలీ రాగి జావా తాగుతుంది. ఇష్టంగా తాగుతుంది. అది హెల్త్ కి చాలా మంచిది అని తెలిపింది.
Also See : Klin Kaara Photos : క్లిన్ కారా ఫస్ట్ బర్త్‌డే.. ఇప్పటివరకు బయటకు వచ్చిన క్లిన్ కారా ఫొటోలు ఇవే..