Pawan Kalyan : ‘బ్రో’ సినిమా సాంగ్‌లో.. హీరోయిన్ స్టెప్స్‌ని పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారా..!

'బ్రో' సినిమాలోని సాంగ్‌లో తన స్టెప్స్ ని పవన్ కల్యాణే కొరియోగ్రఫీ చేశారని.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా తెలియజేశారు.

Pawan Kalyan : ‘బ్రో’ సినిమా సాంగ్‌లో.. హీరోయిన్ స్టెప్స్‌ని పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారా..!

Urvashi Rautela said Pawan Kalyan coreographed her steps in bro movie song

Updated On : January 19, 2024 / 6:36 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నటుడు గానే కాదు రైటర్‌గా, డైరెక్టర్‌గా, డాన్స్ కొరియోగ్రాఫర్‌గా.. ఇలా సినిమా క్రాఫ్ట్స్ లోని చాలా వాటిలో అనుభవం ఉన్న వ్యక్తి. ఘోస్ట్ రైటర్ గా కొన్ని సినిమాలకు పని చేస్తే.. తన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు అయితే తానే రాస్తుంటారు. ఇక అలాగే కొన్ని మూవీలోని సాంగ్ పిక్చరైజేషన్ అండ్ కొరియోగ్రఫీ కూడా పవన్ చేస్తుంటారు. ఈక్రమంలోనే గుడుంబా శంకర్, జానీ వంటి సినిమాల్లో పవనే సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు.

ఇక రీసెంట్‌గా వచ్చిన ‘బ్రో’ సినిమాలో కూడా పవన్ ఒక సాంగ్ కి చాలా వరకు స్టెప్స్ కంపోజ్ చేశారట. బ్రో మూవీలో ‘మై డియర్ మార్కండేయ’ పబ్ సాంగ్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా ఈ పాటలో చిందేసింది. గణేష్ స్వామి, భాను ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ సాంగ్ లోని ఊర్వశి వేసిన చాలా స్టెప్స్ ని పవన్ కొరియోగ్రఫీ చేశారట.

Also read : HanuMan : హనుమాన్ మూవీ గ్రాఫిక్స్ చేసింది.. హైదరాబాద్ కంపెనీ అని మీకు తెలుసా..

ఈ విషయాన్ని ఊర్వశి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. పవన్ కి సినిమా మీద చాలా అవగాహన ఉందని, డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనకు తెలుసని పేర్కొన్నారు. ఇటు సినిమాతో పాటు అటు పాలిటిక్స్ కూడా చేసే పవన్ ని మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రశంసలతో ఊర్వశి ముంచెత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా పవన్ రాజకీయ పనుల వల్ల ప్రస్తుతం మూవీ షూటింగ్స్ అన్నిటికి బ్రేక్ లు పడ్డాయి. ప్రస్తుతం పవన్ చేతిలో OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి. వీటిలో OG మూవీ ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది. హరిహరవీరమల్లు 50 శాతం షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేసుకొని, మిగిలిన బ్యాలన్స్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే కేవలం 10 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది.