Trump Movie Tariff : సినిమాలకు ట్రంప్ దెబ్బ.. ట్రంప్ చెప్పింది హాలీవుడ్ సినిమాలకా? అన్ని దేశాల సినిమాలకా? టాలీవుడ్ కి ఎఫెక్ట్..?

ఇన్నాళ్లు అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద టారీఫ్స్ వేయగా ట్రంప్ ఇప్పుడు సినిమాల మీద కూడా వేయడం గమనార్హం.

Trump Movie Tariff : అమరికలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక విదేశాల నుంచి వచ్చే అన్నిటికి ట్యాక్సులు వేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధిస్తున్న ట్యాక్స్ లు చర్చగా మారాయి. ఇన్నాళ్లు అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద టారీఫ్స్ వేయగా ట్రంప్ ఇప్పుడు సినిమాల మీద కూడా వేయడం గమనార్హం.

ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో.. అమెరికా సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుంది. మా దర్శక నిర్మాతలను హాలీవుడ్ స్టూడియోల నుంచి దూరం చేయడానికి వేరే దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ సినీ పరిశ్రమ నాశనం అవుతుంది. ఇది మిగిలిన దేశాలు అన్ని కలిసి చేస్తున్న కుట్ర. దీన్ని దేశభద్రతగా పరిగణిస్తున్నాం. అందుకే విదేశాల్లో నిర్మించి ఇక్కడ అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నాం. ఈ టారిఫ్ అమలు వెంటనే ప్రారంభించాలని వాణిజ్య శాఖ ప్రతినిషులకు అధికారాలు ఇస్తున్నాను అని తెలిపారు.

Also Read : Alekhya – Kavitha : ఏంటి.. తారకరత్న భార్య, కవిత ఇంత క్లోజ్ ఫ్రెండ్సా? అలేఖ్య పోస్ట్ వైరల్..

అయితే ట్రంప్ చెప్పిన దాంట్లో క్లారిటీ ఇవ్వలేదు. హాలీవుడ్ లో స్టూడియోలు దెబ్బ తింటున్నాయి. కాబట్టి విదేశాల్లో నిర్మించి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలకు ట్యాక్స్ వేస్తాము అన్నారు. అంటే అమెరికా బయట నిర్మించే హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని పలువురు అంటున్నారు. అమెరికాలోనే షూటింగ్స్ చేయాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే విదేశీ సినిమాలు అన్నిటికి ఇదే వర్తిస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే వేరే దేశాల సినిమాలు అమెరికాలో రిలీజ్ అయితే 100 శాతం ట్యాక్స్ వేస్తారు అని కొంతమంది అమెరికా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే అమెరికాలో సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి.

Also Read : Samantha : భార్య భర్తల్ని కొట్టే సీన్స్ కి సమంత ఫుల్ ఎంజాయ్ చేస్తుందట.. నటుడు కామెంట్స్ వైరల్..

అసలే మన టాలీవుడ్, ఇండియన్ సినిమాలకు భారత్ వెలుపల అమెరికా అతిపెద్ద మార్కెట్. అక్కడ మన ప్రతి సినిమా కనీసం 1 మిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలు పైగా కలెక్ట్ చేస్తుంది. పెద్ద సినిమాలు అయితే 50 కోట్ల కలెక్షన్స్ వరకు అమెరికా నుంచే రప్పిస్తాయి. మరి ట్రంప్ చెప్పింది విదేశాల్లో నిర్మించే హాలీవుడ్ సినిమాలకా లేక అన్ని దేశాల సినిమాలకా అనేది స్పష్టత రావాల్సి ఉంది.