Samantha : భార్య భర్తల్ని కొట్టే సీన్స్ కి సమంత ఫుల్ ఎంజాయ్ చేస్తుందట.. నటుడు కామెంట్స్ వైరల్..

చాన్నాళ్లకు సమంత సినిమా ఈవెంట్ కి హాజరవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు.

Samantha : భార్య భర్తల్ని కొట్టే సీన్స్ కి సమంత ఫుల్ ఎంజాయ్ చేస్తుందట.. నటుడు కామెంట్స్ వైరల్..

Actor Charan Peri Interesting Comments on Samantha Regarding Subham Movie

Updated On : May 5, 2025 / 10:31 AM IST

Samantha : సమంత ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది. సమంత ట్రాలాలా అనే నిర్మాణ సంస్థని మొదలుపెట్టి శుభం అనే సినిమాతో మొదటిసారి నిర్మాతగా రాబోతుంది. శుభం సినిమా మే 9 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోనిర్వహించారు. ఈ ఈవెంట్ కి సమంత కూడా హాజరైంది. చాన్నాళ్లకు సమంత సినిమా ఈవెంట్ కి హాజరవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు.

శుభం సినిమాలో పలువురు కొత్తవాళ్లు, యూట్యూబ్, సోషల్ మీడియా ఫేమ్ నటీనటులు నటించారు. శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో నటించిన నటీనటులతో యాంకర్ కాసేపు ఫన్నీ చిట్ చాట్ నిర్వహించారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు నటీనటులు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సమంత సినిమాలో ఎలాంటి సీన్స్ కి బాగా ఎంజాయ్ చేసారు అని అడిగారు.

Also Read : Nandamuri Balakrishna: 50 ఏళ్లు హీరోగా ఈ ప్రపంచంలో ఎవడూ లేడు.. నేను తప్ప- బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

దీనికి నటుడు చరణ్ పేరి సమాధానమిస్తూ.. సినిమాలో భార్యలు భర్తల్ని కొట్టే సీన్ అయితే సమంత గారు ఎంత ఎంజాయ్ చేసారంటే.. క్రేజీ అసలు. మమ్మల్ని కొడుతుంటే సమంత గారు ఫుల్ ఎంజాయ్ చేసారు అని చెప్పాడు. దీంతో ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ సినిమా ట్రైలర్ లో కూడా.. స్ట్రిక్ట్ భర్తలు ఉంటే వాళ్ళని భార్యలకు దయ్యం పడితే ఎలా ఇబ్బంది పెట్టారు, మగవాళ్ళని ఎలా టార్గెట్ చేసారు అని చూపించారు. దీంతో ఇది భార్యాభర్తల హారర్ కామెడీ సినిమా అని తెలుస్తుంది.

Also Read : హీరో నితిన్ “తమ్ముడు” రిలీజ్‌ డేట్ కన్ఫాం.. ఫన్నీ వీడియో విడుదల చేసిన మూవీ టీమ్‌