Nandamuri Balakrishna: 50 ఏళ్లు హీరోగా ఈ ప్రపంచంలో ఎవడూ లేడు.. నేను తప్ప- బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏం చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అంటారు. ఎవరిని చూసి అంత ధైర్యం అంటుంటారు..

Nandamuri Balakrishna: హిందూపురంలో పౌర సన్మాన సభలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50 సంవత్సరాలుగా హీరోగా నటించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ఆయన అన్నారు. ఆ ఘనత సాధించింది తాను ఒక్కడినే అని బాలయ్య చెప్పారు. తెలుగు జాతి అండతోనే తాను హీరోగా మనగలుగుతున్నానని వెల్లడించారు.
”4 సినిమాలు, వరుసగా హిట్లు.. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్.. నాలుగు వరుస హిట్లు.. 50 సంవత్సరాలు హీరోగా చేసిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కొన్నేళ్లు హీరోగా చేసినా.. కెరీర్ మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడమో మరొకటో చాలామందికి జరిగాయి. కానీ 50 ఏళ్లు ఏకధాటిగా హీరోగా చేసింది ఎవరూ లేరు. నేను తప్ప. అది నాకు మాత్రమే సాధ్యమైంది. నేను హీరోగా నిలబడటానికి నాకు ఆ శక్తిని ఇచ్చింది తెలుగు వారే. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.
Also Read: హీరో నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ కన్ఫాం.. ఫన్నీ వీడియో విడుదల చేసిన మూవీ టీమ్
ఏం చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అంటారు. నన్ను చూసుకునే నాకు అంత పొగరు. ఎవరిని చూసి అంత ధైర్యం అంటుంటారు నన్ను చూసి. నా నిజస్వరూపం నాకు అంత ధైర్యం. నాకు అన్నీ తెలుసా అంటారు. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాల్ గా నిలబడతాను. నా మాట ముక్కు సూటిగా ఉంటుంది. నా తీరు గాంభీర్యంగా ఉంటుంది. మీరు నన్ను ఒక నటుడిగానే కాదు.. నాలో ఉన్న మానవత్వం, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, నిబద్దత, నిష్కల్మషం చూసి ఇకపై కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు.
నాకు పద్మభూషణ్ పురస్కారం దక్కినందుకు సంతోషంగా ఉంది. కానీ నా తండ్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి. ఎన్టీఆర్‌కు భారతరత్న అనేది తెలుగువారందరి కోరిక. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్లను వాళ్లు గౌరవించుకున్నట్టు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా” అని బాలకృష్ణ అన్నారు. బాలయ్య ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు హిందూపురంలో పౌర సన్మాన సభ జరిగింది. ఆ సభలో బాలయ్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.