హీరో నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ కన్ఫాం.. ఫన్నీ వీడియో విడుదల చేసిన మూవీ టీమ్
వేణు శ్రీరామ్ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చారు.

హీరో నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’ను ఈ ఏడాది జులై 4న రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీకి డైరెక్టర్‌గా వ్యవహరించిన వేణు శ్రీరామ్ ‘తమ్ముడు’కు దర్శకత్వం వహిస్తున్నారు. వేణు శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో నితిన్‌కు అక్క పాత్రలో సీనియర్ నటి లయ నటిస్తోంది.
ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమి గౌడ యాక్ట్ చేస్తోంది. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేస్తారన్న సందిగ్ధత కొంతకాలంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ వచ్చేసింది.
కాగా, డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు ఈ సినిమా యూనిట్‌లోని పలువురు బర్డ్ డే విషెస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సినిమా యూనిట్ పోస్ట్ చేసింది. లయతో పాటు స్వసిక, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఈ వీడియోలో కనపడుతున్నారు.
ఈ వీడియో ద్వారానే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రమోషన్లు ఎప్పుడు మొదలు పెడదాం? అంటే వారంత ప్రశ్న వేయగా వేణు శ్రీరామ్ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చారు. ఈ సినిమా యూనిట్ వేణు శ్రీరామ్‌తో బర్త్ డే కేక్‌ను కట్ చేయించింది.