Alekhya – Kavitha : ఏంటి.. తారకరత్న భార్య, కవిత ఇంత క్లోజ్ ఫ్రెండ్సా? అలేఖ్య పోస్ట్ వైరల్..
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య కేసీఆర్ కూతురు కవితతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి..

Alekhya Tarakratna Shares Photo and Emotional post With KCR Daughter Kavitha
Alekhya – Kavitha : నటుడు నందమూరి తారకరత్న రెండేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో అప్పట్నుంచి రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తూ ఉంటుంది. పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య కేసీఆర్ కూతురు కవితతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి 20 ఏళ్ళ స్నేహం అంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది.
Also Read : Samantha : భార్య భర్తల్ని కొట్టే సీన్స్ కి సమంత ఫుల్ ఎంజాయ్ చేస్తుందట.. నటుడు కామెంట్స్ వైరల్..
కవితతో దిగిన ఫోటోని షేర్ చేసి.. 20 ఏళ్ళ స్నేహం ఇంకా కొనసాగుతుంది. మనం తుఫానులను ఎదుర్కొన్నాము, అగ్నిలో నడిచాము, అసాధ్యమైన వాటిని ఎదుర్కొన్నాము, అయినా ప్రతి సవాలుతో బలంగా లేచాము. మనం ప్రతిరోజు మాట్లాడుకోకపోవచ్చు. కానీ ఒకరికోసం ఒకరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఇలాంటి బంధం ఇంకా బలంగా, అందంగా పెరుగుతుంది అంటూ రాసుకొచ్చింది అలేఖ్య. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఫ్రెండ్సా అని ఆశ్చర్యపోతున్నారు.
Also See : Sriya Reddy : సలార్ భామ.. జిమ్ లో శ్రియ రెడ్డి స్పెషల్ సెల్ఫీలు..